LK Advani | శత వసంతంలోకి అడుగుపెట్టిన ఎల్‌కే అద్వానీ
LK Advani | భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani) శతవసంతంలోకి అడుగుపెట్టారు. 1927, నవంబర్ 8న కరాచీలో (ప్రస్తుతం పాకిస్థాన్) జన్మించిన ఆయన ఆదివారం వందవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
LK Advani | త్రినేత్ర న్యూస్: భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani) శతవసంతంలోకి అడుగుపెట్టారు. 1927, నవంబర్ 8న కరాచీలో (ప్రస్తుతం పాకిస్థాన్) జన్మించిన ఆయన ఆదివారం వందవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. `అద్వానీ నేడు 100వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. జనసంఘ్ ఆవిర్భవించి 75 ఏండ్లు పూర్తవుతున్న వేళ, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో, అలాగే ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్ (RSS) శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకున్న తరుణంలో.. ప్రభు శ్రీరాముడికి, దీపాలకు ప్రతీకైన దీపావళి పర్వదినాన ఆయన పుట్టినరోజు రావడం ఎంతో విశేషం.

ఆధునిక భారతదేశ చరిత్రలోని ఎన్నో కీలక ఘట్టాలతో ముడిపడిన జీవితం గడిపిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అద్వానీ గారు 1927 నవంబర్ 8న, దేవ్ దీపావళి రోజున జన్మించారు. 1947 దేశ విభజన సమయంలో ఒక యువకుడిగా సింధ్‌లోని తన సొంత గడ్డను విడిచిపెట్టి రావాల్సిన బాధను ఆయన అనుభవించారు. అయినప్పటికీ జీవితాన్ని సున్నా నుంచి తిరిగి నిర్మించుకున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వ్యవస్థలను నిర్మించగల ఈ అసాధారణ లక్షణం ఆయన జీవితాంతం కొనసాగింది. తొలుత జనసంఘ్‌ను బలోపేతం చేయడంలోనూ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని (BJP) నిర్మించడంలోనూ ఆయన ఈ దృఢ సంకల్పాన్ని చాటుకున్నారు.
బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్పా (Congress) ర్టీ బలం 400 స్థానాల నుంచి 200 లోపునకు పడిపోయింది. అలాగే 1996లో బీజేపీ మొట్టమొదటిసారిగా అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. అద్వానీ ఎన్నో తరాల కార్యకర్తలను తీర్చిదిద్ది, నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతం పునాదిపై పార్టీని పటిష్టంగా నిర్మించారు.` అని ప్రధాని మోదీ అన్నారు.

సింధ్ ప్రావిన్స్‌లో..
లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Advani) అవిభక్త భారతదేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో 1927 నవంబర్ 8న కృష్ణచంద్ డీ. అద్వానీ, జియాని దేవి దంపతులకు జన్మించారు. పాకిస్థాన్‌లోని కరాచీలో (Karachi) పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత సింధ్‌లోని కాలేజీలో చేరారు. దేశం విడిపోయినప్పుడు కుటుంబం ముంబైకి మారింది. ఇక్కడ ఆయన న్యాయశాస్త్రం అభ్యసించారు. తన 14వ ఏట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో (RSS) చేరారు. 1951లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్‌లో (Jana Sangh) చేరారు. 1977లో జనతా పార్టీలో చేరారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుడైన అద్వానీ.. దేశ రాజకీయాల గమనాన్నే మార్చేశారు. ఆధునిక భారతదేశంలో హిందుత్వ రాజకీయాలతో ప్రయోగాలు చేశారు. అది విజయవంతమైంది. భారతీయ జనతా పార్టీ 1984లో 2 సీట్లతో ప్రయాణం ప్రారంభించి 2014లో సంపూర్ణ మెజారిటీని సాధించింది.

ఆయన 1998 నుంచి 2004 వరకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేశారు. 2022 జూన్ నుంచి 2004 మేరకు భారత ఉప ప్రధానిగా సేవలు అందించారు. ఆయన 10వ లోక్‌సభ, 14వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 1990లలో బీజేపీకి కేంద్ర శక్తి మారారు. 2009లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన అద్వానీ.. ఆ ఎన్నికల్లో ఓటమితో అధికారం దక్కించుకోలేకపోయారు.

రథయాత్ర
1990లో అద్వానీ రథయాత్ర (Rath Yatra) ప్రారంభించారు. రామ మందిర నిర్మాణానికి మద్దతునిచ్చేందుకు అద్వానీ 25 సెప్టెంబర్ 1990న సోమనాథ్ నుండి రథయాత్ర ప్రారంభించారు. తన ఉద్వేగభరితమైన, అద్భుతమైన ప్రసంగాల వల్ల హిందుత్వానికి హీరోగా మారారు. ఈ రథయాత్ర భారత రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా నిలిచింది.

పురస్కారాలు
దేశానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను 2024లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో (Bharat Ratna) సత్కరించింది.
తాజావార్తలు
- ●Happy Deepavali | త్రినేత్ర న్యూస్ పాఠకులు, శ్రేయోభిలాషులకు.. దీపావళి శుభాకాంక్షలు
- ●Diwali 2026 | నరక బాధలకు చెక్.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక నరక చతుర్దశి
- ●Horoscope | నవంబర్ 8 ఆదివారం.. పూర్వీకుల సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది!
- ●Diwali 2026 | దీపావళి లక్ష్మీపూజ ముహూర్తాలు ఇవే.. ఎవరెప్పుడు పూజ చేయాలంటే?
- ●Diwali 2026 | నేడు దీపావళి.. లక్ష్మీపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
- ●Flight Fares | దీపావళి ఎఫెక్ట్.. విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. హైదరాబాద్-లక్నోకు రూ.18వేలు..!

Happy Deepavali | త్రినేత్ర న్యూస్ పాఠకులు, శ్రేయోభిలాషులకు.. దీపావళి శుభాకాంక్షలు

Diwali 2026 | నరక బాధలకు చెక్.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక నరక చతుర్దశి

Horoscope | నవంబర్ 8 ఆదివారం.. పూర్వీకుల సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది!

Diwali 2026 | దీపావళి లక్ష్మీపూజ ముహూర్తాలు ఇవే.. ఎవరెప్పుడు పూజ చేయాలంటే?






