త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైద‌రాబాద్‌లో పేకాట శిబిరాల‌పై మెరుపుదాడి.. 16 మంది అరెస్టు

Hyderabad | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరాల‌పై గోషామహల్ పోలీసులు మెరుపు దాడి చేశారు.

S

Hyderabad | Published On Nov 9, 2026, 3.15 pm IST

Hyderabad | హైద‌రాబాద్‌లో పేకాట శిబిరాల‌పై మెరుపుదాడి.. 16 మంది అరెస్టు
Advertisement

Hyderabad | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరాల‌పై గోషామహల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. కామన్ గేమింగ్ హౌస్ నిర్వహిస్తూ పేకాట ఆడుతున్న 16 మంది నిందితులను అరెస్ట్ చేయగా, మరో 12 మంది నిందితులు పరారీలో ఉన్నారు.

గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంబజార్, ఫిష్ మార్కెట్ వద్ద ఉన్న ‘ధనలక్ష్మి ఫిష్ గోదాం’లో చట్టవిరుద్ధంగా "అందర్-బాహర్", "తీన్ పత్తి" పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా న‌వంబ‌ర్ 8న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గోషామహల్ పోలీసులు దాడి నిర్వహించారు. రెండు పక్క పక్క గదుల్లో డబ్బులతో పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబ‌ర్ 419/2026, సెక్షన్ 3, 4 తెలంగాణ గేమింగ్ యాక్ట్, 112(2) బి.ఎన్.ఎస్ (BNS) కింద కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ. 23,800 న‌గ‌దు, మూడు పేకాట ముక్క‌ల సెట్లు, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మొబైల్, వివో మొబైల్ ఫోన్ , వివో V29e మొబైల్ ఫోన్, వివో V27 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన నిందితులు వీరే..

  • గుల్షన్ సింగ్ - మచిలీపురా, హైదరాబాద్.
  • అంకిత్ సింగ్ - జిన్సీ చౌరస్తా, హైదరాబాద్.
  • విజయ్ రాజ్ సింగ్ - సీతారాంబాగ్‌, అఘాపురా, హైదరాబాద్.
  • వికాస్ బిరాదార్ - బేగంబజార్ ఛత్రి, హైదరాబాద్.
  • గాడేకర్ అనిల్ - జిన్సీ చౌరస్తా, హైదరాబాద్.
  • అక్షిత్ సింగ్ - జిన్సీ చౌరస్తా, బేగంబజార్, హైదరాబాద్.
  • అంకిత్ - జిన్సీ చౌరస్తా, హైదరాబాద్.
  • కరణ్ సోంకర్ - ఫిష్ మార్కెట్, బేగంబజార్, హైదరాబాద్.
  • హరి ఓం - ఫిష్ మార్కెట్, బేగంబజార్, హైదరాబాద్.
  • ప్రీతమ్ - ఫిష్ మార్కెట్, బేగంబజార్, హైదరాబాద్ (స్వస్థలం: ఫతేపూర్, ఉత్తర ప్రదేశ్).
  • మనీష్ - ఫిష్ మార్కెట్, బేగంబజార్, హైదరాబాద్ (స్వస్థలం: హాజీపూర్‌గాం, ఉత్తర ప్రదేశ్).
  • భాను - ఫిష్ మార్కెట్, బేగంబజార్, హైదరాబాద్ (స్వస్థలం: ఫతేపూర్, ఉత్తర ప్రదేశ్).
  • ప్రకాష్ - ఫిష్ మార్కెట్, బేగంబజార్, హైదరాబాద్ (స్వస్థలం: హాజీపూర్‌గాం, ఉత్తర ప్రదేశ్).
  • అంకిత్ కుమార్ - ఫిష్ మార్కెట్, బేగంబజార్, హైదరాబాద్ (స్వస్థలం: కాన్పూర్, ఉత్తర ప్రదేశ్).
  • సందీప్ నిషాగ్ - ఫిష్ మార్కెట్, బేగంబజార్, హైదరాబాద్ (స్వస్థలం: కాన్పూర్, ఉత్తర ప్రదేశ్).
  • ప్రేమ్ శంకర్ - ఫిష్ మార్కెట్, బేగంబజార్, హైదరాబాద్ (స్వస్థలం: కాన్పూర్, ఉత్తర ప్రదేశ్).
Advertisement
Advertisement