త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | నిఫ్టీ 25,000 దాటినా.. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పెరగ్గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 25,000 మార్కును అధిగమించింది. పీఎస్‌యూ బ్యాంక్ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్‌ల‌కు అండగా నిలవగా, ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి బలోపేతం మార్కెట్‌ల‌కు సానుకూల సంకేతాలుగా నిలిచాయి.

S

Business | Published On Nov 9, 2026, 4.06 pm IST

Stock Markets | నిఫ్టీ 25,000 దాటినా.. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పెరగ్గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 25,000 మార్కును అధిగమించింది. పీఎస్‌యూ బ్యాంక్ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్‌ల‌కు అండగా నిలవగా, ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి బలోపేతం మార్కెట్‌ల‌కు సానుకూల సంకేతాలుగా నిలిచాయి.

స్వ‌ల్పంగా పెరిగిన సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో కదలాడాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 107.25 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 81,106.65 వద్ద ట్రేడవగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 58.25 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 25,044.65 స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ షేర్లలో ఎస్బీఐ అత్యధికంగా 2.43 శాతం లాభపడింది. ఎల్ అండ్ టీ 2 శాతం, ట్రెంట్ 1.95 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.68 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.40 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2.74 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. అల్ట్రాటెక్ సిమెంట్ 2.40 శాతం, టాటా స్టీల్ 2.27 శాతం తగ్గాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.

కొన‌సాగుతున్న విదేశీ పెట్టుబ‌డులు..

మార్కెట్ నిపుణుడు అనిల్ సింఘ్వీ మాట్లాడుతూ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల ప్రవాహం, ఇండియా విక్స్ తగ్గడం మార్కెట్‌కు సానుకూల సంకేతాలని తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ.50వేల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ షేర్లలో కొనుగోళ్లు స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు. నిఫ్టీ పుట్-కాల్ రేషియో శుక్రవారం నాటి 1.37 నుంచి 0.994కు తగ్గిందని, వారాంతపు ఎక్స్‌పైరీ పుట్-కాల్ రేషియో కూడా 1.6 నుంచి 0.82కు పడిపోయిందని వివరించారు. మరోవైపు రూపాయి వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ బలపడుతూ డాలర్‌తో పోలిస్తే రూ.93.97 వద్ద ట్రేడయింది. ఇండియా విక్స్ నాలుగు సెషన్ల తర్వాత దాదాపు 5 శాతం తగ్గడం కూడా మార్కెట్‌ల‌కు ఊరటనిచ్చిందన్నారు.

నిఫ్టీ కీల‌క స్థాయిలు ఇవే..

అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) వరుసగా ఆరు సెషన్లుగా లాభాల స్వీకరణకు పాల్పడుతుండడం, ఐటీ, మెటల్ షేర్లలో బలహీనత మార్కెట్లు మరింత పైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయని సింఘ్వీ విశ్లేషించారు. రంగాల వారీగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 3.73 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలవగా, నిఫ్టీ ఫార్మా 1.65 శాతం, నిఫ్టీ బ్యాంక్ 1.51 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ 1.22 శాతం, నిఫ్టీ సిమెంట్ 1.42 శాతం నష్టపోయాయి. నిఫ్టీకి 24,700-24,815 స్థాయిలో మద్దతు ఉండగా, 25,025-25,125 స్థాయిలో తక్షణ నిరోధం ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. బ్యాంక్ నిఫ్టీకి 58,500-58,800 స్థాయిలో మద్దతు, 59,275-59,600 స్థాయిలో నిరోధం ఉంటుందని అంచనా వేశారు. నిఫ్టీ 25,050 పైన, బ్యాంక్ నిఫ్టీ 59,100 పైన ముగిస్తే మార్కెట్‌కు మరింత సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.

వారాంతపు ఎక్స్‌పైరీలో 24,800 స్థాయిలో పుట్ ఆప్షన్లకు సుమారు 2.25 కోట్ల ఓపెన్ ఇంటరెస్ట్ ఉండడంతో ఆ స్థాయి బలమైన మద్దతుగా ఉంటుంద‌ని, 25,000 వద్ద కాల్ రైటర్లు సుమారు 3.5 కోట్ల పొజిషన్లు కలిగి ఉండడంతో ఆ స్థాయిని దాటడం కష్టమవుతుంద‌ని వివరించారు. గుజరాత్, రాజస్థాన్‌లో పండుగల సెలవుల కారణంగా ట్రేడింగ్ కార్యకలాపాలు మందగించాయని, సాధారణ రోజులతో పోలిస్తే వారాంతపు ఎక్స్‌పైరీలో ట్రేడర్ల భాగస్వామ్యం కూడా తక్కువగా ఉందని తెలిపారు.

Advertisement
Advertisement