Gandra Venkata Ramana Reddy | బెదిరించి.. దబాయింపులతో తప్పించుకోలేరు.. మంత్రి సీతక్కపై గండ్ర వెంకటరమణా రెడ్డి ఆగ్రహం
Gandra Venkata Ramana Reddy | చెప్పులు తెగుతాయ్ అంటూ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమాణా రెడ్డి (Gandra Venkata Ramana Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు.
Gandra Venkata Ramana Reddy | త్రినేత్ర.న్యూస్: చెప్పులు తెగుతాయ్ అంటూ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి (Gandra Venkata Ramana Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాల్లో ఆరోపణలు వస్తే వాటిని ఆధారాలతో సహా నిరూపించాలి గానీ, చెప్పు తెగుతుంది వంటి పరుష వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఇదేం సాంప్రదాయమని ప్రశ్నించారు. మంత్రి సీతక్క వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తమపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ.. వాటికి ఎప్పుడూ సముచితంగా సమాధానం ఇచ్చామే తప్ప ఈ విధంగా దూషణలకు దిగలేదన్నారు. అధికారంలో ఉండి కేవలం ఆరోపణలు చేయడం సరైంది కాదని చెప్పారు. భూపాలపల్లి గడ్డమీద టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తనపై 1400 ఎకరాల భూమి కబ్జా చేశాడని ఆరోపణలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఆ ఆరోపణలు నిరూపించలేకపోయారరన్నారు. ఇప్పటికే నేను దానిపై కోర్టులో పరువు నష్టం కేసులు, క్రిమినల్ కేసులు దాఖలు చేశానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని వెల్లడించారు. కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి భాషలో స్పందించడం అనుచితమని మండిపడ్డారు. బెదిరించి దబాయింపులతో తప్పించుకోలేరని చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






