Char Dham Yatra | చార్ ధామ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. ఇప్పటి వరకూ 12.62 లక్షల మంది పూజలు
Char Dham Yatra | ప్రసిద్ధ చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ (మే 14) 12.62 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు (Pilgrims) చార్ ధామ్ యాత్రను చేపట్టినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
Char Dham Yatra | ప్రసిద్ధ చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ (మే 14) 12.62 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు (Pilgrims) చార్ ధామ్ యాత్రను చేపట్టినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. రోజుకు 80 వేల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సందర్శిస్తున్నట్లు తెలిపింది.
ఆలయ కమిటీ అందించిన సమాచారం ప్రకారం.. ఈ యాత్ర ప్రారంభమైన ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకూ.. కేవలం 26 రోజుల్లోనే 12.62 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు చార్ ధామ్ యాత్రను చేపట్టారు. మే 13న ఒక్క రోజే యమునోత్రి, గంగోత్రి ధామాల్లో 13,000 మంది భక్తులు పూజలు చేయగా.. కేదార్‌నాథ్‌లో 32,000 మంది, బద్రీనాథ్ ధామ్‌లో 21,000 మందికి పైగా భక్తులు పూజలు నిర్వహించారు. ఫలితంగా ఆ ఒక్కరోజే నాలుగు ఆలయాలను 80,405 మంది యాత్రికులు దర్శించుకున్నారు.
ఇక మొత్తం 12.62 లక్షల మందిలో.. యమునోత్రి, గంగోత్రి ధామ్‌లను రెండు లక్షల మందికిపైగా చొప్పున, కేదార్‌నాథ్ ధామ్‌ను ఐదు లక్షల మంది, బద్రీనాథ్ ధామ్‌ను మూడు లక్షల మంది సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. చార్‌దామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 19న తెరిచారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు వరుసగా ఏప్రిల్ 22, 23 తేదీల్లో భక్తుల కోసం తెరిచారు. కాగా, గతేడాది 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు.
Also Read..
భోజ్‌శాల హిందువులదే.. పూజలు చేసుకోవచ్చు.. కోర్టు కీలక తీర్పు
యూఏఈపై దాడులు ఆమోదయోగ్యం కాదు.. పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం : ప్రధాని మోదీ
మరింత ఆలస్యంగా ఓటీటీలోకి ధురంధర్ 2 - రామ్‌చరణ్ సినిమాకు పోటీగా రిలీజ్
సంబంధిత వార్తలు

Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!
జూన్ 20, 2026

Harsil Valley | ఉత్తరాఖండ్‌లో దాగి ఉన్న ఈ లోయ నిజమైన స్వర్గం.. ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం..
జూన్ 20, 2026

Tirumala | మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 25 లక్షల మందికిపైగా భక్తులు.. హుండీ ఆదాయం ఎంతంటే?
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!
- ●Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
- ●Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..
- ●Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ
- ●Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
- ●TG CPGET | సీపీగెట్ హల్‌టికెట్లు విడుదల.. ఎల్లుండి నుంచి పరీక్షలు

Neymar | కన్నీళ్లతోనే ముగిసిన బ్రెజిల్ స్టార్ ప్రయాణం.. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు నెయ్మర్ గుడ్‌బై..!

Nampally Criminal Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..

Venezuela Earthquake | 3,300 దాటిన వెనిజులా భూకంప మృతులు..

Norway vs Brazil | నార్వే హిస్టరీ.. తొలిసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ



