DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు.. జనవరి నుంచే వర్తింపు
DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు (TGSRTC Employees) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏను 2.1 శాతం మేర (DA Hike) పెంచింది. పెరిగిన అలవెన్స్ ఈ ఏడాది జనవరి 1 నుంచే వర్తించనున్నట్లు తెలిపింది.
DA Hike | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు (TGSRTC Employees) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏను 2.1 శాతం మేర (DA Hike) పెంచింది. పెరిగిన అలవెన్స్ ఈ ఏడాది జనవరి 1 నుంచే వర్తించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించారు. ఇప్పటివరకు 50.7 శాతంగా ఉన్న డీఏ.. తాజా పెంపుతో 52.8 శాతానికి పెరిగింది. దీంతో ఆర్టీసీపై ప్రతి నెల రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా డీఏను ప్రభుత్వం చెల్లించనుంది. గతేడాది జూలైలో కూడా డీఏను 2.1 శాతం పెంచిన విషయం తెలిసిందే. డీఏ పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
`ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. 2026 జనవరి నుంచి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది. దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరింది. జనవరి నుంచి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేస్తాం. తెలంగాణ ప్రజా పాలనలో ప్రభుత్వం మొదటి నుంచి ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తున్నది.
సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమంపై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు దవాఖాన అప్‌గ్రేడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రీమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం, కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నది. డీఏ పెంపు ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ఉపయోగపడుతుంది. తెలంగాణలో లైఫ్ లైన్‌గా ఉన్న ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లలా కృషి చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది` అని మంత్రి పొన్నం అన్నారు.
ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న డీఏను ఈరోజు ప్రకటించడం పట్ల సంస్థ ఎండీ నాగిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.
సంబంధిత వార్తలు

TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
ఆగస్టు 25, 2026

Ponnam Prabhakar | బీజేపీ దీక్షలన్నీ డ్రామాలే.. దమ్ముంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురండి: మంత్రి పొన్నం ఫైర్
ఆగస్టు 24, 2026

Ponnam Prabhakar | ఆటో కార్మికులారా! సమ్మె వద్దు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నం
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి

Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?

Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ



