Nida Khan | నాసిక్ టీసీఎస్‌లో లైంగిక వేధింపులు.. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్
Nida Khan | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ (TCS Nashik) ఓపీఓ యూనిట్‌లో లైంగిక వేధింపులు, బలంతంపు మత మార్పిడి (Forced Conversion) కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్ (Nida Khan) ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.
Nida Khan | త్రినేత్ర.న్యూస్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ (TCS Nashik) ఓపీఓ యూనిట్‌లో లైంగిక వేధింపులు, బలంతంపు మత మార్పిడి (Forced Conversion) కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్ (Nida Khan) ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఛత్రపతి సంభాజీనగర్‌లో సిట్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆమెను నాసిక్ కోర్టులో హాజరుపర్చనున్నారు. గత 25 రోజులుగా ఆమె కోసం గాలిస్తున్న పోలీసులకు గురువారం రాత్రి ఆమె చిక్కారు. ఈ ఏడాది మార్చి 26న కేసు నమోదైనప్పటి నుంచి ఆమె పరారీలోనే ఉన్నారు.
పెండ్లి చేసుకుంటామని నమ్మించి లోబర్చుకోవడం, అసభ్యకరంగా తాకడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం, మతం మార్చుకోవాలని మానసిక ఒత్తిడికి గురిచేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. నాసిక్ టీసీఎస్ బీపీవోలో పనిచేస్తున్న 8 మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అరాచకాలు 2022 నుంచి 2026 మధ్య కాలంలో జరిగాయి. నిందితులు బాధితులను బ్లాక్‌మెయిల్ చేస్తూ నరకయాతన చూపించారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తార్ తదితర ఐదుగురు నిందితులతో పాటు ఆపరేషన్స్ హెడ్ అశ్విని చైనాని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నాసిక్ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. గర్భవతినన్న కారణంతో ఆమె ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే ఆమె అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
సంబంధిత వార్తలు

Nida Khan Row | నిదా ఖాన్‌కు షాక్.. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ..!
ఏప్రిల్ 20, 2026

TCS Nashik Case | నేను ప్రెగ్నెంట్ ముందస్తు బెయిల్ ఇవ్వండి..! నాసిక్ కోర్టులో నిదా ఖాన్ పిటిషన్..!
ఏప్రిల్ 17, 2026

TCS Nashik BPO Harassment | “ఇలాంటివి మామూలే”: టీసీఎస్ నాసిక్ బీపీవోలో వేధింపులపై హెచ్ఆర్ నిర్లక్ష్యం.. మత మార్పిడి కుట్రలో 8 మంది అరెస్ట్
ఏప్రిల్ 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



