Nida Khan Row | నిదా ఖాన్‌కు షాక్.. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ..!
Nida Khan Row | నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు సోమవారం నిరాకరించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 27న విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.
Nida Khan Row | నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు సోమవారం నిరాకరించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 27న విచారించనున్నట్లు కోర్టు తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలిక రక్షణ ఇవ్వాలని నిదా ఖాన్ తరఫు న్యాయవాది కోరగా.. నాసిక్ కోర్టు అభ్యర్థనను తిరస్కరించింది. మరో మరోవైపు ఫిర్యాదుదారుడి తరఫు న్యాయవాది సమాధానం దాఖలు చేయడానికి సమయం కోరగా కోర్టు అనుమతించింది. 26 ఏళ్ల నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె రెండు నెలల గర్భవతిగా ఉన్నానని పేర్కొంటూ అరెస్టు నుంచి రక్షణ కోరుతూ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసింది.
నాసిక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బీపీవో యూనిట్‌లో బలవంతంగా మత మార్పిడి ఆరోపణల కేసులో నిదా ఖాన్ మాస్టర్‌మైండ్‌గా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను ఆమె తరఫు న్యాయవాది బాబా సదయ్యద్ ఖండించారు. తన క్లయింట్‌పై ఎలాంటి బలవంతపు మత మార్పిడి, వేధింపుల ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్‌లో లైంగిక దాడులు, మతపరమైన మనోభావాలను దెబ్బతిసినట్లుగా అభియోగాలు మోపారన్నారు. ప్రధాన నిందితుడిగా డానిష్ షేక్ పేరుందని, నిదా ఖాన్ సహ నిందితురాలిగా మాత్రమేనని పేర్కొన్నారు. కంపెనీలో నిదా ఖాన్ హెచ్ఆర్ విభాగంలో పని చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆమె ప్రాపెస్ అసోసియేట్‌గా పని చేసిందని, హెచ్‌ఆర్ విభాగంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించలేదని స్పష్టం చేశారు.
అయితే, ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిదా ఖాన్ పరారీలో ఉండడంతో ఆమె కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పరిస్థితిని పరిశీలించేందుకు జాతీయ మహిళా కమిషన్ (NCW) బృందం నాసిక్‌ను సందర్శించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మహారాష్ట్ర పోలీసులకు, టీసీఎస్ సంస్థకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి నివేదిక కోరింది. డిజిటల్ ఆధారాలు ఈ కేసులో కీలకంగా మారినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియా వేదికగా బాధితులను వేధించారని, స్టాకింగ్ ఆరోపణలు ఉన్నాయని సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!





