త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల‌ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో మంగ‌ళ‌వారం దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 561.46 పాయింట్లు కోల్పోయి 77,054.94 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 158.95 పాయింట్లు పడిపోయి 24,052.05 వద్ద స్థిరపడింది.

S

Business | Published On Jul 14, 2026, 3.53 pm IST

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల‌ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో మంగ‌ళ‌వారం దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 561.46 పాయింట్లు కోల్పోయి 77,054.94 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 158.95 పాయింట్లు పడిపోయి 24,052.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేర్లలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు లాభాలతో ముగిశాయి.

అత్య‌ధికంగా క్షీణించిన రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ సూచీ అత్యధికంగా 2 శాతం క్షీణించింది. అనంతరం నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 1.86 శాతం, నిఫ్టీ ఆటో సూచీ 1.65 శాతం పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 1.20 శాతం నష్టపోగా, నిఫ్టీ ఐటీ సూచీ ఒక శాతం తగ్గింది. మరోవైపు నిఫ్టీ ఫార్మా సూచీ 1.02 శాతం లాభపడగా, నిఫ్టీ మెటల్ సూచీ 0.60 శాతం పెరిగింది. మార్కెట్‌లో అస్థిరత పెరిగినట్లు సూచించే ఇండియా విఎక్స్ 3.53 శాతం పెరిగి 13.75 వద్ద ముగిసింది. ఇది మార్కెట్‌లో వోలాటిలిటీ పెరిగినట్లు సూచిస్తోంది. విస్తృత మార్కెట్‌ల‌లో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.6 శాతం తగ్గగా, స్మాల్‌క్యాప్ సూచీ ఒక శాతం క్షీణించింది.

భారీగా ప‌త‌న‌మైన రూపాయి విలువ‌, పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

విదేశీ మారక మార్కెట్‌లో భారత రూపాయి కూడా బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 58 పైసలు పడిపోయి 96.20 వద్ద ముగిసింది. అంతకుముందు ముగింపు 95.62గా నమోదైంది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా పెరిగాయి. హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా చ‌మురు స‌ర‌ఫ‌రాకు మ‌ళ్లీ ఆటంకం ఏర్ప‌డుతుంద‌నే ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. దీంతో చ‌మురు ధ‌ర‌లు ధ‌ర‌లు ఎగ‌బాకాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 4.26 శాతం మేర ఎగ‌బాకి బ్యారెల్‌కు 85 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 3.65 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 80 డాల‌ర్ల‌కు చేరింది. మార్కెట్‌ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి పెర‌గ‌డంతో దాదాపు అన్ని రంగాలు భారీ న‌ష్టాల్లో ముగిశాయి. అయితే ప్ర‌స్తుతం సూచీలు కీల‌క మ‌ద్ద‌తు స్థాయిల వద్ద కొన‌సాగుతున్నాయ‌ని, ఇవి బ్రేక్ అయి సూచీలు కింద‌కు ప్ర‌యాణిస్తే మార్కెట్ల‌లో మ‌రింత అమ్మ‌కాల ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement