SIR | తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగించండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
SIR | తెలంగాణలో సర్(SIR) గడువు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు గణేష్, నవీన్ యాదవ్, డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్, మోత రోహిత్, రాజేష్ టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఇతర ముఖ్య నేతలు కలిశారు.
SIR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో సర్(SIR) గడువు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు గణేష్, నవీన్ యాదవ్, డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్, మోత రోహిత్, రాజేష్ టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఇతర ముఖ్య నేతలు కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాల్లో నత్తనడకన సాగుతుంది. హైదరాబాద్ జిల్లాలో సగటున 21 శాతం ఓటరు సవరణ ప్రక్రియ పుట్టింది. 10 రోజులు సమయం మాత్రమే ఉంది.. దానిని పొడిగించాలని కోరాం. హైదరాబాద్ జిల్లా మంత్రిగా మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు ఎన్నికల కమిషన్‌ను కలిశామని తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా 4500 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి.. అర్బన్‌లో ఓటరు సవరణ సరిగా జరగడం లేదు. హైదరాబాద్‌లో విద్యార్థుల భాగస్వామ్యం తీసుకోవాలని కోరాం. బీఎల్‌వోలు ఇళ్లల్లోకి రావడం లేదు.. ఫారంలు సరిగా ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్‌వోలకు ఎలాంటి సమస్య లేకుండా వారి పేమెంట్ కూడా చేశారని పేర్కొన్నారు.
అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. 10 రోజులు సమయం సరిపోదు.. అదనంగా గడువు పెంచాలని కోరాం. బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో సమస్యలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ టీచర్లు, జీహెచ్ఎంసీ సహకారం తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పార్టీ కేడర్ క్రియాశీలంగా పని చేయాలని కోరుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
- ●Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్‌లు అవసరం లేదు..
- ●Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు
- ●Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్
- ●Eggs Prices | హైదరాబాద్‌లో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. డజన్ రూ. 100 పైనే..!
- ●AI | ఏఐపై ప్రపంచ నిపుణుల హెచ్చరిక.. లక్షల ఉద్యోగాలకు ముప్పు..

Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?

Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్‌లు అవసరం లేదు..

Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు

Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్




