Donald Trump | ఇరాన్ పని అయిపోయింది.. మొజ్తబా ఖమేనీ 90 శాతం చనిపోయినట్లే : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను, అగ్రశ్రేణి కమాండర్లను కోల్పోయిందని చెప్పారు. ప్రస్తుత సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) సైతం 90 శాతం చనిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.
International | Published On Jul 14, 2026, 10.35 am IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ప్రపంచ రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులతో ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను, అగ్రశ్రేణి కమాండర్లను కోల్పోయిందని చెప్పారు. ప్రస్తుత సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) సైతం 90 శాతం చనిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వారి (ఇరాన్‌ని ఉద్దేశిస్తూ) వద్ద నావికాదళం లేదు. వైమానిక దళం లేదు. అంతా శూన్యం. వారి యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ నిఘా వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వారి అగ్రనాయకులు, అత్యంత ప్రతిభావంతులైన కమాండర్లు అందరూ హతమయ్యారు. అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ పని కూడా అయిపోయింది. ఆయన 90 శాతం పోయాడు. మరణానికి చేరువలో ఉన్నాడు" అని ట్రంప్ వివరించారు.
దాడులపై కాంగ్రెస్‌కు ట్రంప్ లేఖ..
ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించినట్లు ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు లేఖ రాశారు. ఇరాన్‌పై దాడులు కొనసాగుతున్నాయని.. హర్మూజ్‌లో (Strait of Hormuz) నౌకలపై ఇరాన్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. దౌత్యపరమైన పరిష్కారాల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించి ఒప్పందం కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. అయితే, ఆ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు.
వాణిజ్య నౌకల నుంచి 20 శాతం టోల్ వసూల్..
మరోవైపు హర్మూజ్ జలసంధికి (Strait of Hormuz) సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్మూజ్ గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి 20 టోల్ వసూలు చేస్తామని ప్రకటించారు. ఇరాన్ దాడుల నుంచి నౌకలకు రక్షణ కల్పిస్తున్నందుకు గాను తాము చేస్తున్న ఖర్చులను తిరిగి వసూల్ చేసుకుంటామని తేల్చిచెప్పారు. ట్రంప్ ప్రకటించినట్లు హర్మూజ్‌లో టోల్ వసూలు ప్రారంభమైతే చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ట్రంప్ ప్రతిపాదనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హర్మూజ్ నిర్వహణలో అమెరికా పాత్రను తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇరాన్ అనుమతి లేకుండా జలసంధి గుండా ప్రయాణించడానికి ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించింది.
సంబంధిత వార్తలు

Donald Trump | వెనెజువెలాతో చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన
ఆగస్టు 29, 2026

Donald Trump | అమెరికా-కెనడా ట్రేడ్ వార్.. సరస్సు పేరు మార్చిన ట్రంప్
ఆగస్టు 28, 2026

US pauses visa appointments | ట్రంప్ మరో షాక్.. ప్రపంచ వ్యాప్తంగా వీసా అపాయింట్మెంట్లు నిలిపివేత
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Yesha Nagula Song | యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఏష నాగుల సాంగ్.. మాస్ స్టెప్పులతో అదగొట్టిన నాని, కీర్తి సురేశ్
- ●Kapra Lake | కొనసాగుతున్న కాప్రా చెరువు పునరుద్ధరణ పనులు.. వినాయక నిమజ్జనంపై ఆంక్షలు..
- ●Horoscope | ఆగస్టు 30 రాశి ఫలాలు.. ఈ రాశివారికి డబ్బు చేతికి అందడంలో జాప్యం!
- ●Warangal Mamnoor Airport | వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు "దొడ్డి కొమరయ్య" పేరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కీలక విజ్ఞప్తి
- ●PM Internship Scheme 2026 | 10 పాస్ అయితే చాలు.. నెలకు రూ. 9,000 స్టైపెండ్ : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ మూడో విడత షురూ!
- ●Telangana Assembly sessions 2026 | సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ 'కీలక' తీర్మానంపైనే అందరి దృష్టి

Yesha Nagula Song | యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఏష నాగుల సాంగ్.. మాస్ స్టెప్పులతో అదగొట్టిన నాని, కీర్తి సురేశ్

Kapra Lake | కొనసాగుతున్న కాప్రా చెరువు పునరుద్ధరణ పనులు.. వినాయక నిమజ్జనంపై ఆంక్షలు..

Horoscope | ఆగస్టు 30 రాశి ఫలాలు.. ఈ రాశివారికి డబ్బు చేతికి అందడంలో జాప్యం!

Warangal Mamnoor Airport | వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు "దొడ్డి కొమరయ్య" పేరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కీలక విజ్ఞప్తి



