Telangana | మనువరాలితో కారు డ్రైవింగ్.. ఎస్ఐకి షాకిచ్చిన రవాణా శాఖ
Telangana | నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని గంధంగూడలో శనివారం సాయంత్రం ఓ ఎస్ఐ ఆరున్నరేళ్ల వయసున్న తన మనువరాలితో కారు డ్రైవింగ్ చేయించిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ పూజారి తిరుపతి సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐకి మరో షాక్ తగిలింది.
Telangana | త్రినేత్ర.న్యూస్ : నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని గంధంగూడలో శనివారం సాయంత్రం ఓ ఎస్ఐ ఆరున్నరేళ్ల వయసున్న తన మనువరాలితో కారు డ్రైవింగ్ చేయించిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ పూజారి తిరుపతి సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐకి మరో షాక్ తగిలింది. మనువరాలితో డ్రైవింగ్ నేర్పించిన కారు(టీఎస్07 జీపీ7450) రిజిస్ట్రేషన్‌ను రవాణా శాఖ ఏడాది పాటు రద్దు చేసింది. ఇక ఎవరైతే కారు నడిపారో ఆ మైనర్‌కు 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదని రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ చర్యలు మోటార్ వెహికల్ యాక్ట్‌కు లోబడే తీసుకున్నామని తెలిపారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైగా పనిచేస్తున్న పూజారి తిరుపతి.. తన మనవరాలికి గంధంగూడ రోడ్డులో కారు డ్రైవింగ్ నేర్పిస్తుండగా... ఆ మార్గంలో వెళుతున్న వారు అడ్డుకుని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. దీంతో సదరు ఎస్సై.. కారు ఆటోమేటిక్‌దని.. కంట్రోల్ తన చేతిలో ఉంటుందని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతలో బాలిక.. తన తాత ఎస్సై అంటూ మాట్లాడసాగింది. ఈ క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
తాజావార్తలు
- ●TG BC Study Circle | యూసీపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
- ●Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?
- ●Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్‌లు అవసరం లేదు..
- ●Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు
- ●Kayadu Lohar | వయసులో 30 ఏళ్లు పెద్ద - ఆ హీరోతో కయదు లోహర్ రొమాన్స్ - నెటిజన్ల ట్రోల్స్
- ●Eggs Prices | హైదరాబాద్‌లో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు.. డజన్ రూ. 100 పైనే..!

TG BC Study Circle | యూసీపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Sabarimala Chief Priest | శబరిమల కొత్త తంత్రిగా గోల్డ్ చోరీ కేసులో అరెస్ట్ అయిన రాజీవరు కొడుకు?

Nvidia | గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ గేమ్స్ కోసం ఖరీదైన డివైస్‌లు అవసరం లేదు..

Maoists | గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు




