Strait of Hormuz | హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
Strait of Hormuz | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో రవాణా నౌకలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఒమన్ తీరం సమీపంలో రెండు యూఏఈ ట్యాంకర్ల (UAE Tankers)పై ఐఆర్‌జీసీ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది (Indian sailor) మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు.
International | Published On Jul 14, 2026, 9.20 am IST
Strait of Hormuz | త్రినేత్ర.న్యూస్ : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో రవాణా నౌకలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఒమన్ తీరం సమీపంలో రెండు యూఏఈ ట్యాంకర్ల (UAE Tankers)పై ఐఆర్‌జీసీ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది (Indian sailor) మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు భారతీయులు కాగా, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నట్లు యూఏఈ రక్షణశాఖ ప్రకటించింది.
మొంబాసా, అల్ బహియా అనే రెండు జాతీయ చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసినట్లు యూఏఈ రక్షణశాఖ తెలిపింది. ఈ దాడి కారణంగా రెండు ట్యాంకర్లలోనూ భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో నౌకలకు తీవ్రమైన నష్టం వాటిల్లినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ దాడి ఘటనను యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సంబంధిత వార్తలు

Donald Trump | ఇరాన్ పని అయిపోయింది.. మొజ్తబా ఖమేనీ 90 శాతం చనిపోయినట్లే : డొనాల్డ్ ట్రంప్
జులై 14, 2026

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
జులై 8, 2026

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
జులై 7, 2026
తాజావార్తలు
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం
- ●Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?
- ●Prashant Kishor | రూ. 5.77 కోట్ల అప్పులు, కారు లేదు, ఎనిమిది క్రిమినల్ కేసులు.. ప్రశాంత్ కిషోర్ ఆస్తుల వివరాలు
- ●NCL Recruitment | నార్తర్న్ కోల్డ్ఫీల్డ్స్లో 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు..
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
- ●Donald Trump | ఇరాన్ పని అయిపోయింది.. మొజ్తబా ఖమేనీ 90 శాతం చనిపోయినట్లే : డొనాల్డ్ ట్రంప్

Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం

Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?

Prashant Kishor | రూ. 5.77 కోట్ల అప్పులు, కారు లేదు, ఎనిమిది క్రిమినల్ కేసులు.. ప్రశాంత్ కిషోర్ ఆస్తుల వివరాలు

NCL Recruitment | నార్తర్న్ కోల్డ్ఫీల్డ్స్లో 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు..



