Tamil Nadu | హంగ్ మెట్లపై తమిళనాడు అసెంబ్లీ.. రాష్ట్రంలో ఇలా జరగడం ఎన్నోసారి?
Tamil Nadu | తమిళనాడులో అసెంబ్లీ (Tamil Nadu) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో తమిళనాడు అసెంబ్లీ ప్రస్తుతం హంగ్ మెట్లపై (Hung Assembly) ఉంది.
Tamil Nadu | త్రినేత్ర.న్యూస్: తమిళనాడులో అసెంబ్లీ (Tamil Nadu) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో తమిళనాడు అసెంబ్లీ ప్రస్తుతం హంగ్ మెట్లపై (Hung Assembly) ఉంది. ఎవరు ఎవరితో జట్టు కడతారు? ఒంటరిగా పోటీ చేసి చరిత్ర సృష్టించిన విజయ్ (TVK Vijay) కోసం ఏ కూటమి నుంచి పార్టీలు బయటకు వస్తాయి?. అసలు ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందా? తమిళనాడులో ఇలా హంగ్ ఏర్పడటం ఇది ఎన్నోసారి?
దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు కూటములు కట్టి ఎన్నికల బరిలో నిలిచాయి. రెండేండ్ల క్రితమే పార్టీ ఏర్పాటు చేసిన సినీ నటుడు విజయ్ ఒంటరిగా పోటీచేశాడు. మార్పు కోసం ఎదురుచూస్తున్న తమిళ ప్రజలు విజయ్ టీవీకేకు పట్టం కట్టారు. సీఎం స్టాలిన్‌నే ఓడగొట్టిన ప్రజలు ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ మాత్రం ఇవ్వలేదు. దీంతో విజయ్ ఇప్పుడు ఎవరితో జట్టుకడతాడు, ఆయన ముందున్న మార్గం ఏంటని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తమిళనాడులో 234 సీట్లకు గాను 108 సీట్లలో విజయ్ పార్టీ విజయం సాధించింది. 73 స్థానాల్లో డీఎంకే, 53 చోట్ల అన్నాడీఎంకే విజయం సాధించింది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యే బలం అవసరం అవుతుంది. అయితే విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో చాలా ఏండ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది.
హంగ్ ఎన్నోసారి..
గత 60 ఏళ్లుగా (1967 నుంచి) తమిళనాడులో హంగ్ ఏర్పడటం ఇదే మొదటిసారి కాదు. 1952లో మద్రాస్ స్టేట్ (తమిళనాడు) మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. దీంతో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో రాజాజీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2006లో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే 96 సీట్లు మాత్రమే గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు బయటి నుంచి మద్దతు ఇచ్చింది. దీంతో ఆ ఐదేండ్ల పాటు రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం నడిచింది. ఈసారి కూడా హీరో విజయ్ ఇదేవిధంగా హంగ్ సర్కారును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఆయనకు మద్దతిచ్చేది ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
వారితో చేతులు కలుపుతాడా?
ప్రస్తుతం 108 సీట్లలో టీవీకే విజయం. విజయం సీఎం కావాలంటే మరో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీనికోసం స్వతంత్రంగా గెల్చిన అభ్యర్థులు, చిన్న పార్టీలు, డీఎంకే కూటమిలోని పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 5 స్థానాలు గెలిచిన కాంగ్రెస్, చెరో 2 స్థానాల్లో విజయం సాధించిన సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలతో విజయ్ చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తున్నది.
అయితే ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న డీఎంకేను కాదని కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ఇస్తుందా అనే విషయమై సర్వత్రా చర్చ నడుస్తున్నది. డీఎంకేను అధికారానికి దూరంగా ఉంచేందుకు విజయ్‌కు బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకే సిద్ధపడొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
అసలు హంగ్ అంటే ఏమిటీ..
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకీ రాకపోవడమే హంగ్. ఇలాంటి సదర్భాల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీ.. స్వతంత్రులు, ఇతర పార్టీలతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అలా కాని సందర్భంగా అతిపెద్ద పార్టీకి.. మరో పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



