త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | నైతిక విలువ‌లుంటే బండి సంజ‌య్ రాజీనామా చేయాలి : జీవ‌న్‌రెడ్డి

Jeevan Reddy | నైతిక విలువ‌లుంటే కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ రాజీనామా చేయాల‌ని బీఆర్ఎస్ నేత టీ జీవ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. జ‌గిత్యాల‌లో ఆయ‌న సోమ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. బేటి బచావో అంటూ నినాదాలు ఇస్తూ ఆడ‌బిడ్డ‌కు అన్యాయం చేసిన బండి సంజ‌య్‌ని ప‌క్క‌న కూర్చోబెట్టుకొని ప్ర‌ధాని మాట్లాడ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌న్నారు.

P

Telangana | Published On May 11, 2026, 3.33 pm IST

Jeevan Reddy | నైతిక విలువ‌లుంటే బండి సంజ‌య్ రాజీనామా చేయాలి : జీవ‌న్‌రెడ్డి
Advertisement

Jeevan Reddy | నైతిక విలువ‌లుంటే కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ రాజీనామా చేయాల‌ని బీఆర్ఎస్ నేత టీ జీవ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. జ‌గిత్యాల‌లో ఆయ‌న సోమ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. బేటి బచావో అంటూ నినాదాలు ఇస్తూ ఆడ‌బిడ్డ‌కు అన్యాయం చేసిన బండి సంజ‌య్‌ని ప‌క్క‌న కూర్చోబెట్టుకొని ప్ర‌ధాని మాట్లాడ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌న్నారు. బండి సంజయ్‌ తనయువుడ భగీరథ చేసిన నేరానికి 20 ఏళ్ల శిక్ష ప‌డుతుంద‌న్నారు. మైనర్ బాలిక సంఘటనపై కనీసం రేవంత్ రెడ్డి హోమ్ శాఖ మంత్రిగా ఉండి పట్టించుకోవడం లేద‌ని విమ‌ర్శించారు. నేరాన్ని కప్పిపుచే ప్రయత్నం చేసిన బండి సంజయ్ సైతం శిక్షార్హుడేన‌ని, బండి సంజయ్ బాధ్యత రాహిత్యం నైతికంగా మంత్రిగా కొనసాగే హక్కు లేద‌న్నారు.

క్రమశిక్షణ గల కార్యకర్త‌గా ఎదిగిన నాయకుడిగా.. నీ కుటుంబాన్ని క్రమశిక్షణ నేర్పించలేనప్పుడు దేశానికి ఏం క్రమశిక్షణ నేర్పిస్తావ‌ని నిల‌దీశారు. వాస్తవాలు మాట్లాడితే కరీంనగర్‌లో ఎమ్మెల్యే నివాసంపై దాడి చేయించావ‌ని.. ఇదేనా నీ క్రమశిక్షణ అంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ది ఫెవిక‌ల్ బంధ‌మ‌ని, రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగిన న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంద‌న్నారు. మోదీ అండ ఉందని.. రేవంత్ రెడ్డి కళ్ళకు గంతలు కట్టుకున్నాడ‌ని, భగీరథ్‌పై ఉద్దేశ పూర్వకంగా నేరానికి అనుగుణమైన సెక్షన్లు పెట్టకుండా తప్పించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే పీసీసీ కనీసం ఖండించ‌లేద‌ని విమ‌ర్శించారు.

Advertisement
Advertisement