CM Vijay | ప్రధాని మోదీతో విజయ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
CM Vijay | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో విజయ్ చర్చించారు.
CM Vijay | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) భేటీ అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానిని కలవడం ఇదే మొదటిసారి. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో విజయ్ చర్చించారు.
పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు, జీఎస్టీ పరిహారం బకాయిలు, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన వాటా, వివాదాస్పద మేకేదాటు నీటి వివాదంలో కేంద్రం జోక్యం వంటి ఇతర అంశాలపై ప్రధానికి వినతి పత్రం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర సహాయాన్ని పెంచాలని, పట్టణ మౌలిక సదుపాయాలు, రవాణా, పారిశ్రామిక విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టులకు వేగంగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు. దాదాపు 20 నిమిషాలపాటూ ఈ భేటీ సాగింది.
ఈ భేటీలో మేకేదాటు అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కావేరీ నదిపై రామనగర జిల్లా కనకపుర సమీపంలోని మేకెదాటు వద్ద ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. అయితే ఈ రిజర్వాయర్ (Mekedatu Dam) నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల తమ రాష్ట్రానికి రావాల్సిన కావేరి నీటి వాటా దెబ్బతింటుందని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ విషయంపై నిన్న ప్రధానికి విజయ్ లేఖ కూడా రాశారు. ఇది సుప్రీంకోర్టు సమర్థించిన కావేరీ వాటర్ ట్రిబ్యునల్ (Cauvery Water Tribunal) నిర్ణయానికి పూర్తి విరుద్ధమని సీఎం విజయ్ తన లేఖలో ప్రధానంగా వాదించారు. మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయొద్దని, కావేరి ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం తమిళనాడు నీటి హక్కులను రక్షించాలని కోరారు.
ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో విజయ్ సమావేశం కానున్నారు. పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడమే కాకుండా.. తమిళనాడుకు కేంద్ర కేటాయింపులను పెంచేలా ఒత్తిడి తెచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులతో విజయ్ సమావేశంకానున్నారు. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కూడా విజయ్ కలవనున్నారు.
సంబంధిత వార్తలు

Mekedatu Dam Issue | కావేరీ జలాలపై మళ్లీ రగడ.. మేకెదాటు డ్యామ్‌ను అడ్డుకోవాలని ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
మే 26, 2026

Annamalai | నేరగాళ్లకు స్వేచ్ఛ లభించింది.. సెలబ్రేషన్ మూడ్ నుంచి బయటకు రండి.. విజయ్‌పై అన్నామలై ధ్వజం
మే 26, 2026

AIADMK MLA | అన్నాడీఎంకేలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. నాలుగో ఎమ్మెల్యే కూడా..
మే 26, 2026
తాజావార్తలు
- ●Paddy | ధాన్యమంతా నీళ్ల పాలు.. అకాల వర్షానికి నీటమునిగిన కళ్లాలు
- ●Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. చాలెంజ్‌కి సిద్ధమా..? కేటీఆర్‌కు పొన్నం సవాల్
- ●Feroz Khan | గాంధీ భవన్లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో
- ●India Stealth Fighter Jet | అగ్రదేశాల సరసన భారత్.. స్వదేశీ టెక్నాలజీతో ఫైటర్ జెట్స్‌ను తయారు చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- ●Harish Rao | మూడో డిస్కం ఏర్పాటు.. ప్రైవేటీకరణ దిశగా విద్యుత్ రంగం : హరీశ్‌రావు
- ●Balka Suman | ఇలా.. నోరు జారితే ఎలా? సుమన్ వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

Paddy | ధాన్యమంతా నీళ్ల పాలు.. అకాల వర్షానికి నీటమునిగిన కళ్లాలు

Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. చాలెంజ్‌కి సిద్ధమా..? కేటీఆర్‌కు పొన్నం సవాల్

Feroz Khan | గాంధీ భవన్లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో

India Stealth Fighter Jet | అగ్రదేశాల సరసన భారత్.. స్వదేశీ టెక్నాలజీతో ఫైటర్ జెట్స్‌ను తయారు చేయనున్న ప్రైవేట్ కంపెనీలు



