India Stealth Fighter Jet | అగ్రదేశాల సరసన భారత్.. స్వదేశీ టెక్నాలజీతో ఫైటర్ జెట్స్‌ను తయారు చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
భారత్ సొంతంగా తయారుచేస్తున్న 5వ తరం 'AMCA' స్టెల్త్ ఫైటర్ జెట్ల నిర్మాణానికి కేంద్రం ముందడుగు వేసింది. ఏపీలోని పుట్టపర్తిలో ప్రైవేట్ సంస్థలతో జట్టు.
- భారత్ 'స్టెల్త్ ఫైటర్' జెట్ల తయారీ ఏపీలోనే
- రేసులో టాటా, ఎల్ అండ్ టీ
- రక్షణ రంగంలో చరిత్రాత్మక ఘట్టం
- స్వదేశీ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ (AMCA) ప్రాజెక్టు కోసం హెచ్ఏఎల్ (HAL)ను పక్కనపెట్టి కేంద్రం తొలిసారి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానం
- రూ.15,000 కోట్లతో ఏపీలోని పుట్టపర్తిలో కొత్త ప్లాంట్
- 2027 నాటికి కాంట్రాక్ట్ ఖరారు
- 2028-2032 మధ్య తొలి ప్రోటోటైప్ విమానాన్ని పరీక్షించేలా ప్రణాళికలు
- ఈ జెట్ పూర్తయితే అమెరికా, రష్యా, చైనాల తర్వాత 5వ తరం ఫైటర్ జెట్ ఉన్న నాలుగో దేశంగా భారత్
India Stealth Fighter Jet | త్రినేత్ర.న్యూస్ : భారత రక్షణ రంగంలో (Defence Sector) సరికొత్త శకానికి తెరలేచింది. దేశీయంగా ముచ్చటగా తొలి 5వ తరం 'స్టెల్త్ ఫైటర్' జెట్ అయిన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) తయారీ కోసం ప్రభుత్వం బుధవారం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేసింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగ సంస్థను పక్కనబెట్టి, ఆంధ్రప్రదేశ్‌లో ఈ జెట్లను తయారుచేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు అవకాశమివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రైవేట్ చేతుల్లోకి ఫైటర్ జెట్ల తయారీ
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ మెగా ఫైటర్ జెట్ ప్రోగ్రామ్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కు కాకుండా.. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్అండ్‌టీ-బెల్-డైనమాటిక్ (L&T-BEL-Dynamatic) కన్సార్టియం, అలాగే భారత్ ఫోర్జ్-బీఈఎంఎల్-డేటా ప్యాటర్న్స్ కన్సార్టియంలను ఆహ్వానించింది. ఇలాంటి విమానాల తయారీలో ప్రైవేట్ సంస్థలు రంగంలోకి దిగడం రక్షణ రంగంలో 'ఆత్మనిర్భరత' దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగుగా నిపుణులు చెబుతున్నారు.
పుట్టపర్తి కేంద్రంగా ఐదు ప్రోటోటైప్‌లు
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విలువ రూ. 15,000 కోట్లు. దీనికి కేంద్రమే పూర్తి నిధులు సమకూర్చుతుంది. ఏపీలోని సత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi) వద్ద 650 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌లో టెండర్ దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ ఈ ఫైటర్ జెట్లకు సంబంధించిన ఐదు ప్రోటోటైప్‌లను (Prototypes), ఒక స్ట్రక్చరల్ టెస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నిర్మిస్తుంది. ఇందుకు డీఆర్‌డీఓ (DRDO) కింద పనిచేసే ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA)తో కలిసి ప్రైవేట్ సంస్థ పనిచేయాల్సి ఉంటుంది.

టైమ్‌లైన్ ఎలా ఉందంటే..
ఈ ప్రాజెక్టు కోసం గత ఏడాది (2025) మధ్యలో ఏడు సంస్థలు పోటీపడ్డాయి. టెక్నికల్ ఎవాల్యుయేషన్ తర్వాత మూడు సంస్థలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఇవి తమ తుది బిడ్‌లను దాఖలు చేస్తాయి. జనవరి-మార్చి 2027 నాటికి ఎవరికి కాంట్రాక్ట్ (L1) దక్కుతుందో తేలనుంది. ఆ తర్వాత 2028-2032 మధ్య తొలి ప్రోటోటైప్ గాల్లోకి ఎగురుతుంది. 2035 తర్వాత ఇవి భారత వాయుసేనలో పూర్తిస్థాయిలో (Series production) సేవలు అందిస్తాయని అంచనా.
అగ్రదేశాల సరసన భారత్
ప్రస్తుతం ప్రపంచంలో ఐదో తరం ఫైటర్ జెట్లు కేవలం మూడు దేశాల వద్దే ఉన్నాయి. అవి అమెరికా (F-22, F-35), చైనా (J-20), రష్యా (Su-57). ఇప్పుడు మన AMCA పూర్తైతే ఆ ఎలైట్ క్లబ్‌లో భారత్ సగర్వంగా అడుగుపెడుతుంది.
AMCA అదిరిపోయే ఫీచర్లు ఇవే..
- ఇది సింగిల్ సీట్, ట్విన్ ఇంజిన్ తో వచ్చే స్టెల్త్ జెట్
- శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ స్టెల్త్ కోటింగ్స్ (Stealth coatings) ఉపయోగిస్తారు
- అమెరికా, రష్యాల జెట్ల తరహాలోనే ఆయుధాలను విమానం లోపల (Internal weapons bays) ఉంచుకునే సదుపాయం ఉంటుంది
- 55,000 అడుగుల ఎత్తులో సునాయాసంగా ఆపరేట్ అవుతుంది
- లోపలి భాగంలో 1,500 కేజీల ఆయుధాలను, బయటి వైపు మరో 5,500 కేజీల వెపన్స్ ను, దాంతో పాటు 6,500 కేజీల ఇంధనాన్ని (Fuel) మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం
తాజావార్తలు
- ●Paddy | ధాన్యమంతా నీళ్ల పాలు.. అకాల వర్షానికి నీటమునిగిన కళ్లాలు
- ●Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. చాలెంజ్‌కి సిద్ధమా..? కేటీఆర్‌కు పొన్నం సవాల్
- ●Feroz Khan | గాంధీ భవన్లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో
- ●Harish Rao | మూడో డిస్కం ఏర్పాటు.. ప్రైవేటీకరణ దిశగా విద్యుత్ రంగం : హరీశ్‌రావు
- ●Balka Suman | ఇలా.. నోరు జారితే ఎలా? సుమన్ వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
- ●CM Vijay | ప్రధాని మోదీతో విజయ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Paddy | ధాన్యమంతా నీళ్ల పాలు.. అకాల వర్షానికి నీటమునిగిన కళ్లాలు

Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. చాలెంజ్‌కి సిద్ధమా..? కేటీఆర్‌కు పొన్నం సవాల్

Feroz Khan | గాంధీ భవన్లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో

Harish Rao | మూడో డిస్కం ఏర్పాటు.. ప్రైవేటీకరణ దిశగా విద్యుత్ రంగం : హరీశ్‌రావు



