Harish Rao | మూడో డిస్కం ఏర్పాటు.. ప్రైవేటీకరణ దిశగా విద్యుత్ రంగం : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణలో మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన వెనుక విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతు డిస్కం లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన వెనుక విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతు డిస్కం లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు.
'రైతు డిస్కం' పై ప్రజాభిప్రాయం తీసుకోకుండా, అసెంబ్లీలో చర్చించకుండా ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుంది. రైతు డిస్కం ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాలుగానీ, ప్రజాప్రతినిధులుగానీ ఎవరూ అడగలేదు. 29 లక్షల మంది వ్యవసాయ వినియోగదారుల కోసం కేవలం 2,000 మంది సిబ్బందిని కేటాయించడం దారుణం. సిబ్బంది కొరత, సమన్వయ లోపంతో క్షేత్రస్థాయిలో విద్యుత్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వనరులు చూపకుండా రూ. 35,000 కోట్ల బకాయిల వసూలు బాధ్యత కొత్త డిస్కంకు అప్పగించడం ఏంటి? కొత్త డిస్కంలో చేరే ఉద్యోగులకు ప్రత్యేక ప్రమోషన్ల ఆశ చూపడం ప్రలోభాలకు గురిచేయడమే అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
జీవో నెం. 44 ప్రకారం.. ఈ నిర్ణయం రైతుల సంక్షేమం కోసం కాదు, ఆర్థిక పరమైన అంశాల కోసమేనని స్పష్టమవుతోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై స్పష్టత లేకుండా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఎలా మంజూరు చేస్తారు? కొత్త డిస్కంలో క్రాస్ సబ్సిడీ లేకపోవడం వల్ల ప్రభుత్వంపై భారీ సబ్సిడీ భారం పడుతుంది. ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం 30 లక్షల మంది రైతుల అనుమతి లేకుండా కొత్త డిస్కంలోకి మార్చడం చట్టవిరుద్ధం. కమిషన్ బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ 2 నుంచి డిస్కం ప్రారంభమౌతుందని ప్రభుత్వం ప్రకటించడం కమిషన్‌ను ఒత్తిడికి గురిచేయడమే. విచారణను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయొద్దు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ విచారణలు జరపాలి. ఆర్థిక, సాంకేతిక, చట్టపరమైన లోపాలున్న మూడో డిస్కం దరఖాస్తును ఈఆర్సీ (ERC) నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Ponguleti Srinivasa Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి పొంగులేటి
- ●India Solar Market | అమెరికాను దాటేసిన భారత్.. సోలార్ పవర్లో మనమే నెంబర్ 2
- ●CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చిద్దాం.. మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
- ●Paddy | ధాన్యమంతా నీళ్ల పాలు.. అకాల వర్షానికి నీటమునిగిన కళ్లాలు
- ●Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. చాలెంజ్‌కి సిద్ధమా..? కేటీఆర్‌కు పొన్నం సవాల్
- ●Feroz Khan | గాంధీ భవన్లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో

Ponguleti Srinivasa Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి పొంగులేటి

India Solar Market | అమెరికాను దాటేసిన భారత్.. సోలార్ పవర్లో మనమే నెంబర్ 2

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చిద్దాం.. మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ

Paddy | ధాన్యమంతా నీళ్ల పాలు.. అకాల వర్షానికి నీటమునిగిన కళ్లాలు



