AIADMK MLA | అన్నాడీఎంకేలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. నాలుగో ఎమ్మెల్యే కూడా..
AIADMK MLA | అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి మరో ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు (4th AIADMK MLA Set To Quit). ఆయన కూడా టీవీకే తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.
AIADMK MLA | అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై అంతర్గత కలహాలతో సతమతమవుతున్న అన్నాడీఎంకే (AIADMK) పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీలో ఎమ్మెల్యేల రాజీనామాల (AIADMK MLAs resign) పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేసి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK)తో జతకట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా వారి బాటలోనే పయనిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు (4th AIADMK MLA Set To Quit).
అంబసముద్రం ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య (Isakki Subbiah) ఇవాళ అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను సమర్సించారు. అయితే, అది టైప్ చేసి ఉండటంతో ఆ లేఖను స్పీకర్ ఆమోదించేందుకు నిరాకరించారు. రాజీనామా లేఖను తన స్వహస్తాలతో రాసి సమర్పించాలని సుబ్బయ్యకు సూచించారు. దీంతో ఆయన మళ్లీ తన రిజైన్ లెటర్‌ను చేత్తోరాసి స్పీకర్‌ను కలవనున్నారు. రాజీనామా తర్వాత సుబ్బయ్య కూడా టీవీకే తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.
ఇక ఇప్పటికే ముగ్గురు ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరిన విషయం తెలిసిందే. మదురాంతకం నియోజకవర్గం నుంచి గెలిచిన మరగాథం , ధారాపురం నుంచి గెలిచిన సత్యభామ, పెరుందురై నుంచి ఎన్నికైన జయకుమార్ నిన్న తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించగా.. ఆయన వాటిని ఆమోదించారు. ఆ తర్వాత ఆ ముగ్గురూ ఆ తర్వాత వెంటనే వారు టీవీకే (TVK) మంత్రి ఆదవ్ అర్జునను కలిసి ఆ పార్టీలో చేరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 21, 2026

MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
సెప్టెంబర్ 10, 2026

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం



