Paddy | ధాన్యమంతా నీళ్ల పాలు.. అకాల వర్షానికి నీటమునిగిన కళ్లాలు
Paddy | రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం రైతన్నకు తీరని వేదనను మిగిల్చింది. వర్షాల ధాటికి అటు కళ్లాలలో ఇటు కొనుగోలు కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యమంతా తడిచిపోయింది.
జలమయమైన కొనుగోలు కేంద్రాలు
కన్నీరు పెట్టుకున్న రైతన్నలు
అన్నదాతలకు తీరని నష్టం
తడిచిన ధాన్యం సర్కారు కొనేనా?
Paddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం రైతన్నకు తీరని వేదనను మిగిల్చింది. వర్షాల ధాటికి అటు కళ్లాలలో ఇటు కొనుగోలు కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యమంతా తడిచిపోయింది. భారీ వర్షం పడిన ప్రాంతాల్లో ధాన్యం నీట మునిగింది. మరికొన్ని చోట్ల ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిచాయి. దీంతో అన్నదాతలు.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ... అనేక ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే తమకు ఈ పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు.
ఇంకెప్పుడు పూర్తి చేస్తారు
రాష్ట్ర ప్రభుత్వం 50 రోజుల కిందటే రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. అయితే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరగడంతో దాదాపు 60 శాతం ధాన్యం అటు రైతుల పొలాల్లోనూ, ఇటు మార్కెట్ యార్డుల్లోనూ బస్తాల్లో నిల్వ ఉంచారు. చాలా చోట్ల టార్పాలిన్ కవర్లు లేకపోవడంతో.. వర్షం ధాటికి పంట నీళ్ల పాలైంది. యాసంగి సీజన్ కు సంబంధించి సుమారు 51 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. నెలాఖరు కల్లా మొత్తం కొనుగోళ్లు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ దాదాపు 60 శాతం ధాన్యంలో సగంపైగా పంట పూర్తిగా లేదా పాక్షికంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందో లేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
సంబంధిత వార్తలు

Ponguleti Srinivasa Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి పొంగులేటి
మే 27, 2026

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చిద్దాం.. మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
మే 27, 2026

Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. చాలెంజ్‌కి సిద్ధమా..? కేటీఆర్‌కు పొన్నం సవాల్
మే 27, 2026
తాజావార్తలు
- ●Ponguleti Srinivasa Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి పొంగులేటి
- ●India Solar Market | అమెరికాను దాటేసిన భారత్.. సోలార్ పవర్లో మనమే నెంబర్ 2
- ●CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చిద్దాం.. మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
- ●Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. చాలెంజ్‌కి సిద్ధమా..? కేటీఆర్‌కు పొన్నం సవాల్
- ●Feroz Khan | గాంధీ భవన్లో లొల్లి.. కొట్టుకున్న ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్.. వీడియో
- ●India Stealth Fighter Jet | అగ్రదేశాల సరసన భారత్.. స్వదేశీ టెక్నాలజీతో ఫైటర్ జెట్స్‌ను తయారు చేయనున్న ప్రైవేట్ కంపెనీలు

Ponguleti Srinivasa Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి పొంగులేటి

India Solar Market | అమెరికాను దాటేసిన భారత్.. సోలార్ పవర్లో మనమే నెంబర్ 2

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చిద్దాం.. మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ

Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. చాలెంజ్‌కి సిద్ధమా..? కేటీఆర్‌కు పొన్నం సవాల్



