త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Annamalai | నేర‌గాళ్ల‌కు స్వేచ్ఛ ల‌భించింది.. సెల‌బ్రేష‌న్ మూడ్ నుంచి బ‌య‌ట‌కు రండి.. విజ‌య్‌పై అన్నామ‌లై ధ్వ‌జం

Annamalai | రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల విష‌య‌మై బీజేపీ నేత అన్నామ‌లై (Annamalai).. విజ‌య్‌ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కొత్త ప్ర‌భుత్వం ఇంకా సెలబ్రేష‌న్‌ మూడ్ నుంచి బ‌య‌ట‌కు రాలేదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

D

National | Published On May 26, 2026, 3.44 pm IST

Annamalai | నేర‌గాళ్ల‌కు స్వేచ్ఛ ల‌భించింది.. సెల‌బ్రేష‌న్ మూడ్ నుంచి బ‌య‌ట‌కు రండి.. విజ‌య్‌పై అన్నామ‌లై ధ్వ‌జం
Advertisement

Annamalai | మదురైలో మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడి హత్య, కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు తమిళనాడు రాజకీయాల‌ను కుదిపేస్తున్నాయి. విజయ్ (CM Vijay) నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన 15 రోజుల్లోనే ఈ ఘ‌ట‌న‌లు చేసుకోవ‌డం ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అదే స‌మ‌యంలో అత్యాచారం, హ‌త్య ఉదంతాల‌పై టీవీకే మంత్రి ఇచ్చిన స‌మాధానం, మీడియా స‌మావేశాల్లో ఈ నేరం గురించి పోలీసులు న‌వ్వుతూ మాట్లాడ‌టం ఈ వివాదానికి మ‌రింత ఆజ్యం పోసిన‌ట్లైంది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల విష‌య‌మై బీజేపీ నేత అన్నామ‌లై (Annamalai).. విజ‌య్‌ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కొత్త ప్ర‌భుత్వం ఇంకా సెలబ్రేష‌న్‌ మూడ్ నుంచి బ‌య‌ట‌కు రాలేదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. "తమిళనాడులో డ్రగ్స్ విక్రేతలకు, లైంగిక దాడికి పాల్పడేవారికి, హంతకులకు స్వేచ్ఛ లభించింది. రాష్ట్ర పోలీసులు గతం నుండి ఎలాంటి పాఠాలూ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. కొత్త ప్ర‌భుత్వం ఇంకా సెల‌బ్రేష‌న్‌ మూడ్‌లోనే ఉన్నట్లుంది. ఇప్పుడైనా బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘోరాల‌ను ఎదుర్కొవాలి" అంటూ ఆయన సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గ‌త డీఎంకే పాల‌న‌లో మ‌హిళ‌లు, పిల్ల‌ల‌కు ఉన్న అభ‌ద్ర‌తా వాతావ‌ర‌ణ‌మే ఇప్పుడు కూడా కొన‌సాగుతోందంటూ అన్నామ‌లై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. "టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు వారాలు అవుతోంది. ప్రమాణ స్వీకార సంబరాల నుంచి ముఖ్యమంత్రి తిరు విజయ్ బ‌య‌ట‌కు రావాలి. రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణ కోసం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి" అని అన్నామ‌లై డిమాండ్ చేశారు.

ఇక ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌తిప‌క్ష‌నేత ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. "ఇది త‌మిళ‌నాడా..? లేక ఉత్త‌రప్ర‌దేశా..? ఎన్నికల ముందు మార్పు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను అదుపులో పెట్టలేకపోతోంది" అంటూ ప్ర‌భుత్వంపై ఉద‌య‌నిధి స్టాలిన్ విమ‌ర్శ‌లు గుప్పించారు. "రాష్ట్రంలో మహిళల రక్షణ ఎక్కడుంది..?" అంటూ ప‌లువురు నేత‌లు కూడా విజయ్‌ను నిలదీస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement