త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా క‌ట్ట‌లేదు.. చాలెంజ్‌కి సిద్ధ‌మా..? కేటీఆర్‌కు పొన్నం స‌వాల్

Ponnam Prabhakar | బీఆర్ఎస్ హ‌యాంలో 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా క‌ట్ట‌లేదు అని చాలెంజ్‌కి సిద్ధ‌మా అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు స‌వాల్ విసిరారు.

S

Telangana | Published On May 27, 2026, 6.57 pm IST

Ponnam Prabhakar | మీరు 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా క‌ట్ట‌లేదు.. చాలెంజ్‌కి సిద్ధ‌మా..? కేటీఆర్‌కు పొన్నం స‌వాల్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ హ‌యాంలో 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా క‌ట్ట‌లేదు అని చాలెంజ్‌కి సిద్ధ‌మా అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు స‌వాల్ విసిరారు. 10 సంవత్సరాలుగా 10 వేల గ్రామ పంచాయతీలలో మీరు ఒక్క ఇల్లు కట్టిన.. మీరు ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉంటామ‌ని మంత్రి పొన్నం స్ప‌ష్టం చేశారు. మేము 12 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టాం.. మేము చాలెంజ్‌గా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇళ్లు కడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా చెప్తున్న మీరు 10 సంవత్సరాలుగా కట్టిన ఇళ్ల కంటే మేము 5 సంవత్సరాల్లో ఎక్కువ కట్టి చూపిస్తాం. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా హైదరాబాద్ సమస్యలు తెలుసు. హైదరాబాద్‌లో ఇల్లు లేని స్వంత ఖాళీ స్థలాలు ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారు. ప్రభుత్వ స్థలాలు వెతికి ఇల్లు నిర్మించే ప్రక్రియ‌లో భాగంగా 40 స్థలాలు వెయ్యి గజాల నుండి 25 ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించాం. ఇక్కడ పేదలందరికీ ఇళ్లు కట్టించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ కేబినెట్ దృఢ సంకల్పంతో ఉన్నామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement