త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సిద్దిపేటపై కాంగ్రెస్ స‌ర్కార్ వివ‌క్ష : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | సిద్దిపేట‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం వివ‌క్ష చూపిస్తుంద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. వివ‌క్ష‌తో నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Nov 26, 2026, 3.48 pm IST

Harish Rao | సిద్దిపేటపై కాంగ్రెస్ స‌ర్కార్ వివ‌క్ష : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్ : సిద్దిపేట‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం వివ‌క్ష చూపిస్తుంద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. వివ‌క్ష‌తో నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన సైన్స్ ఫెయిర్ కార్య‌క్ర‌మానికి హ‌రీశ్‌రావు హాజ‌రై ప్ర‌సంగించారు.

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ స్కూల్లో నిర్వహించడంపై అభ్యంతరం వ్య‌క్తం చేశారు. గ‌తంలో గ‌ర్ల్స్ హై స్కూల్ వేదిక‌గా గొప్ప‌గా నిర్వ‌హించుకునే వాళ్ల‌మ‌ని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించే స్థోమత కూడా లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్య‌మంత్రి, జిల్లా క‌లెక్ట‌ర్, డీఈవో బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఎమ్మెల్యేను, జ‌ర్న‌లిస్టుల‌ను ఆహ్వానించాల‌న్న సోయి కూడా లేదు. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేటకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

సిద్దిపేటలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేశామ‌ని బ‌ల్ల‌లు చ‌రుచుతున్నారు. విద్యార్థులకు ఇప్పటికీ ఒక జత దుస్తులు కూడా అందలేదు.. విద్యా సంవ‌త్స‌రం ముగిసే స‌మ‌యం కూడా స‌మీపిస్తోంది. ఎందుకు దుస్తులు పంపిణీ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సిద్దిపేటపై వివక్షతో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమ‌ర్శించారు. వెంటనే బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల దుస్తులు పంపిణీ చేయాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement