Jailer 2 | జైలర్ 2 టికెట్లు ఫ్రీ – విద్యుత్ కోతలపై తమిళనాడు కౌన్సిలర్ వెరైటీ నిరసన
తమిళనాడులో విద్యుత్ కోతలపై ఏఐఏడీఎంకే కౌన్సిలర్ వెరైటీగా నిరసన తెలిపాడు. విద్యుత్ కోతల కారణంగా ఎదురైన సమస్యలను వెల్లడించిన ప్రజలకు రజనీకాంత్ జైలర్ 2 టికెట్లు ఫ్రీగా ఇచ్చాడు. అతడి నిరసన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Entertainment | Published On Oct 22, 2026, 2.59 pm IST
Jailer 2 | తమిళనాడులోని తిరుప్పూర్ ప్రాంతానికి చెందిన ఏఐఏడీఎంకే కౌన్సిలర్ విద్యుత్ కోతలపై వినూత్నంగా నిరసనలు తెలిపాడు. తన ఏరియాలో పవర్ కట్ కారణంగా ఎదరవుతున్న సమస్యలను వెల్లడించిన ప్రజలకు ఉచితంగా జైలర్ 2 టికెట్లు ఇస్తానని ప్రకటించాడు. చెప్పినట్లుగానే 125 మందికి ఫ్రీగా టికెట్లు కూడా ఇచ్చాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అతడు చేసిన నిరసన సోషల్ మీడియాల్ హాట్ టాపిక్‌గా మారింది.
విద్యుత్ కోతలు...
తమిళనాడులో విద్యుత్ కోత తీవ్రంగా ఉందంటూ కొద్ది రోజులుగా టీవీకే ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుప్పూర్ సిటీలో తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ ఈ విద్యుత్ కోతలపై వెరైటీగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. కరెంట్ పోయిన సమయంలో తమ ఇళ్లలో సెల్ఫీలు తీసి తనకు పంపించిన వారికి జైలర్ 2 టికెట్లు ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు. అతడి ప్రకటను మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు దాదాపు వంద వరకు ఆ ఏరియా ప్రజలు అతడికి సెల్ఫీలు తీసి పంపించారు. చెప్పినట్లుగానే వారికి రజనీకాంత్ సినిమా టికెట్లను ఉచితంగా అందజేశాడు. మరో ఇరవై ఐదు మంది ఏఐఏడీఎంకే కార్యకర్తలతో కలిసి సదరు కౌన్సిలర్ జైలర్ 2 సినిమా చూశారు. సినిమా చూడటానికి వచ్చిన ప్రజలతో కలిసి థియేటర్‌లోనూ కరెంట్ కోతలపై నిరసన వ్యక్తం చేశారు ప్రజా సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జైలర్ 2 టికెట్లను ఉచితంగా అందజేసినట్లు కౌన్సిలర్ చెప్పారు. అతడి ప్లాన్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తోన్నారు.
ఐదు వందల కోట్లు...
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ వారంలోనే ఐదు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. జైలర్ 2లో హృతిక్ రోషన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ గెస్ట్ రోల్స్‌లో కనిపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nayanthara | నయనతార వర్సెస్ సాయిపల్లవి – రామాయణకు పోటీగా మహాశక్తి
అక్టోబర్ 21, 2026

Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
అక్టోబర్ 20, 2026

Rukmini Vasanth | వెండితెరపైకి దిగ్గజ తెలుగు సింగర్ బయోపిక్ – హీరోయిన్గా కన్నడ బ్యూటీ
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●PM Modi Donald Tusk Meeting | భారత్‌తో పోలాండ్ కీలక డీల్.. ఈ 3 రంగాల్లో ఇక తిరుగుండదు!
- ●Adilabad CCI | ఇక ఆదిలాబాద్ సీసీఐ కనుమరుగు.. స్థానికుల ఆవేదన
- ●SIP | వేతనం పెరిగిన కొద్దీ ఏటా 10 శాతం ఎస్ఐపీ పెంచాలా..?
- ●Amit Shah | కాంగ్రెస్ పార్టీ 2030 నాటి ఎన్నికల్లోనూ గెలవలేదు : అమిత్ షా
- ●Ramayana | రామాయణపై మరో ట్విస్ట్ - ఓటీటీలో డబ్బులు పెట్టి చూడాల్సిందే - బడ్జెట్ కష్టాలే కారణమా?
- ●Anthropic | క్లాడ్ డుయెట్.. పనులు గుర్తించి పూర్తి చేసే ఏఐ ఏజెంట్..

PM Modi Donald Tusk Meeting | భారత్‌తో పోలాండ్ కీలక డీల్.. ఈ 3 రంగాల్లో ఇక తిరుగుండదు!

Adilabad CCI | ఇక ఆదిలాబాద్ సీసీఐ కనుమరుగు.. స్థానికుల ఆవేదన

SIP | వేతనం పెరిగిన కొద్దీ ఏటా 10 శాతం ఎస్ఐపీ పెంచాలా..?

Amit Shah | కాంగ్రెస్ పార్టీ 2030 నాటి ఎన్నికల్లోనూ గెలవలేదు : అమిత్ షా



