త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tadoba Tiger Reserve | 3 నెల‌ల పాటు త‌డోబా టైగ‌ర్ రిజ‌ర్వ్ మూసివేత‌

Tadoba Tiger Reserve | తెలంగాణ - మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని త‌డోబా - అంధేరి టైగ‌ర్ రిజ‌ర్వ్ మూడు నెల‌ల పాటు మూసివేస్తున్న‌ట్లు అట‌వీశాఖ అధికారులు ప్ర‌క‌టించారు. జూన్ 30 నుంచి సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

S

National | Published On Jun 3, 2026, 6.28 pm IST

Tadoba Tiger Reserve | 3 నెల‌ల పాటు త‌డోబా టైగ‌ర్ రిజ‌ర్వ్ మూసివేత‌
Advertisement

Tadoba Tiger Reserve | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ - మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని త‌డోబా - అంధేరి టైగ‌ర్ రిజ‌ర్వ్ మూడు నెల‌ల పాటు మూసివేస్తున్న‌ట్లు అట‌వీశాఖ అధికారులు ప్ర‌క‌టించారు. జూన్ 30 నుంచి సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌ర్షాకాలంలో వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ‌, ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా అట‌వీ ముఖ్య సంర‌క్ష‌ణ అధికారి పీఎన్ శుక్లా మాట్లాడుతూ.. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా మూడు నెల‌ల పాటు త‌డోబా టైగ‌ర్ రిజ‌ర్వ్ మూసివేస్తామ‌న్నారు. అయితే బ‌ఫ‌ర్ టూరిజంకు సంబంధించిన ప్రాంతాల్లో సంద‌ర్శ‌కుల‌కు అనుమతిస్తామ‌న్నారు. త‌డోబాలోని ప్ర‌ధాన ప్రాంతాల్లోకి మాత్రం నిషేధం ఉంటుంద‌న్నారు. ఇక త‌డోబా వెబ్‌సైట్ హ్యాక్‌కు గురైంద‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న తోసిపుచ్చారు. ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం mytadoba.mahaforest.gov.in సంద‌ర్శించాల‌ని సూచించారు.

Advertisement
Advertisement