త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Public School | ఆరుట్ల పాఠశాల తెలంగాణ విద్యా విధానానికి రోల్ మోడల్

Telangana Public School | తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (ఆరుట్ల)ను రాష్ట్ర ప్రభుత్వ విప్‌ల బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టులో భాగంగా... పైల‌ట్ ప్రాజెక్టుగా రూపు దిద్దుకున్న ఈ పాఠశాలల పనితీరును, అక్కడ అందుతున్న విద్యా సౌకర్యాలను విప్‌లు స్వయంగా పరిశీలించారు.

S

Telangana | Published On May 8, 2026, 5.06 pm IST

Telangana Public School | ఆరుట్ల పాఠశాల తెలంగాణ విద్యా విధానానికి రోల్ మోడల్
Advertisement

Telangana Public School | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (ఆరుట్ల)ను రాష్ట్ర ప్రభుత్వ విప్‌ల బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టులో భాగంగా... పైల‌ట్ ప్రాజెక్టుగా రూపు దిద్దుకున్న ఈ పాఠశాలల పనితీరును, అక్కడ అందుతున్న విద్యా సౌకర్యాలను విప్‌లు స్వయంగా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీర్ల ఐలయ్య, బల్మూరి వెంకట్, విజయరమణారావు, రామచంద్ర నాయక్, అద్దంకి దయాకర్, వేముల వీరేశంతో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఇక తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ చారకొండ వెంకటేష్, ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్ రావు పాఠశాల విశేషాలను వివరించారు.

ప్రభుత్వ విప్‌ల బృందానికి తెలంగాణ విద్యా కమిషన్ చైర్‌పర్సన్ ఆకునూరి ముర‌ళీ.. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌లు మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ తీసుకువచ్చారని అన్నారు. ఈ ఆరుట్ల పాఠశాల తెలంగాణ విద్యా విధానానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ బడి.. ప్రగతికి అద్దంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వంద తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌, నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు ప్రభుత్వ విప్‌లు. దీంతో తెలంగాణ భవిష్యత్ చిత్రం మారనుంద‌న్నారు.

తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరి మురళీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని.. అందుకే ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ ప్ర‌భుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసిందన్నారు ఆకునూరి మురళి. ఈ పాఠశాలలో బోధన పద్ధతులు, మౌలిక సదుపాయాలు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్వహణలో సరికొత్త ఒరవడితో ముందుకు వెళుతున్నామన్న క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేశామ‌ని.. ఆ క‌మిటీలు ప్రతిరోజూ పాఠ‌శాల నిర్వ‌హ‌ణ‌ను పర్యవేక్షిస్తుంటాయ‌ని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అందుబాటులోకి వస్తే విద్యా రంగంలో అద్భుతాలు జరుగుతాయి, పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య చేరువవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆకునూరి మురళీ.

ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మ‌ల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... త‌మ ప్ర‌భుత్వం విద్యా, వైద్య రంగాలను ప్రాధాన్య‌త‌గా భావిస్తుంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ హయాంలోఈ రంగాల‌ను నిర్ల‌క్ష్యానికి గురిచేస్తే... త‌మ ప్ర‌భుత్వం... దానికి భిన్నంగా అభివృద్ధి చేస్తుందన్నారు. ఆరుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆద‌ర్శంగా నిల‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు మ‌ల్ రెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలోఆరుట్ల స‌ర్పంచ్ శోభాకుమారి, స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ స‌భ్యులు, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement