త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sircilla Rajaiah | స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పెంచుకోవాలి : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య సిరిసిల్ల

Sircilla Rajaiah | స్థానిక సంస్థలు తమ సొంత ఆదాయ వనరులను పెంచుకునే దిశగా కొత్త మార్గాలను అన్వేషించాలని తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య సిరిసిల్ల సూచించారు. మధ్య తెలంగాణ జిల్లాల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.

P

Telangana | Published On May 8, 2026, 4.52 pm IST

Sircilla Rajaiah | స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పెంచుకోవాలి : ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య సిరిసిల్ల
Advertisement

Sircilla Rajaiah | స్థానిక సంస్థలు తమ సొంత ఆదాయ వనరులను పెంచుకునే దిశగా కొత్త మార్గాలను అన్వేషించాలని తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య సిరిసిల్ల సూచించారు. మధ్య తెలంగాణ జిల్లాల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలు కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్రాంట్లపైనే ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించేలా ఆదాయ వనరులను విస్తరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజల మౌలిక అవసరాలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

కమిషన్ సభ్యుడు సంకేపల్లి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన చిన్న గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో నెలకొన్న ప్రత్యేక సమస్యలపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆయా సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తున్నామని చెప్పారు. సమావేశంలో కమిషన్ మెంబర్ సెక్రటరీ పీ కాత్యాయనీ దేవి, మధ్య తెలంగాణ జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, సర్పంచులు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement