Supreme Court | 9 శాతం మంది విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు.. NTF సర్వేలో షాకింగ్ విషయాలు
Supreme Court | దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో (higher education institutions) చదువుతున్న విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ కోసం సుప్రీంకోర్టు (Supreme Court) నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF) బృందం చేపట్టిన దేశవ్యాప్త సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 9 శాతం మంది విద్యార్థులు ఆత్మహత్య ఆలోచనలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో (higher education institutions) చదువుతున్న విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF) బృందం చేపట్టిన దేశవ్యాప్త సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 2.43 లక్షల మందికి పైగా విద్యార్థులపై నిర్వహించిన ఈ సర్వేలో 9 శాతం మంది విద్యార్థులు ఆత్మహత్య ఆలోచనలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. సుమారు 15 శాతం మంది విద్యార్థులు గత ఆరు నెలల్లో తీవ్రమైన ఒత్తిడిని, ఆందోళనను ఎదుర్కొన్నట్లు తేలింది.
ఎన్‌టీఎఫ్ నిర్వహించిన ఈ సర్వేలో అత్యధికంగా 67 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (SC, ST, OBC) వర్గాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో దాదాపు 34 శాతం మంది క్యాంపస్‌లో తాము అందరితో కలవలేకపోతున్నామని, ఏదో ఒక సందర్భంలో తమను తాము అవుట్‌సైడర్స్‌గా భావిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 56 శాతం మంది విద్యార్థులు విద్యాసంస్థల్లో ఎదురయ్యే తీవ్రమైన సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యాలపై నమ్మకం ఉందని తెలపగా.. తమ విద్యాసంస్థలో కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో లేవని దాదాపు 32 శాతం మంది స్పష్టం చేశారు.
వ్యవస్థాగత లోపాలే ప్రధాన కారణాలు
సుప్రీంకోర్టు నియమించిన టాస్క్ ఫోర్స్ పరిశీలన ప్రకారం.. విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక కారణాల కంటే విద్యాసంస్థల్లోని వ్యవస్థాగత లోపాలే ప్రధాన కారణాలుగా తేలింది. అటెండెన్స్ విషయంలో కఠినమైన రూల్స్, అకడమిక్ షెడ్యూల్స్, ఇంజినీరింగ్ కాలేజీల్లో విపరీతమైన పోటీ తత్వం, మెడికల్ విద్యార్థులకు పరిమితులను మించిన ఆన్-కాల్ డ్యూటీ గంటలు, వేధింపులు, అకడమిక్ సపోర్ట్ లేకపోవడం వంటి ప్రధాన సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఐఐటీ ఢిల్లీ, బాంబేల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు అత్యంత ప్రాధానత్య సంతరించుకున్నాయి.
కమిటీ కీలక సిఫార్సులు
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చిలో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్‌కు జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్యానెల్‌లో ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ అలోక్ సారిన్, మేరీ ఈ జాన్, అర్మాన్ అలీ, రాజేందర్ కచ్ఛ్రూ, సీమా మెహ్రోత్రా తదితర నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్ కాలేజీలు వంటి ఉన్నత విద్యా సంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు, వారి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కీలకమైన మార్గదర్శకాలను రూపొందించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రమాణాలతో కూడిన స్టూడెంట్ సపోర్ట్ సిస్టమ్స్, ఫ్యాకల్టీకి ప్రత్యేక శిక్షణ, క్రైసిస్ ఎస్‌ఓపీ (SOPs), విద్యా విధానంలో మార్పులు వంటి కీలక సిఫార్సులు చేసింది.
Also Read..
సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
షేర్ మార్కెట్‌లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
సెప్టెంబర్ 29, 2026

Danam Nagender | దానం నాగేందర్ ఎమ్మెల్యే కాదు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ప్రకటిస్తూ గెజిట్
సెప్టెంబర్ 28, 2026

Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
- ●Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం

Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే

Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..



