Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
Gold Price | దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. శుక్రవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధరపై ఏకంగా రూ.2,500 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.1,40,900కు చేరింది. దీపావళి తర్వాత రిటైల్ డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
Gold Price | దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. శుక్రవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధరపై ఏకంగా రూ.2,500 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.1,40,900కు చేరింది. దీపావళి తర్వాత రిటైల్ డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400గా ఉండగా.. శుక్రవారం రూ.2,500 తగ్గి రూ.1,40,900కు చేరింది. ఈ ధరల్లో అన్ని పన్నులు కలిపి ఉన్నాయి. అటు వెండి ధర కూడా కిలోకు రూ.3,500 తగ్గి రూ.1,84,000కు పడిపోయింది. గురువారం కిలో వెండి ధర రూ.1,87,500 వద్ద ముగిసింది.
బంగారం ధరలపై ఒత్తిడి..
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్ నుంచి అందుతున్న బలహీన సంకేతాలు, దీపావళి అనంతరం దేశీయంగా తగ్గిన కొనుగోళ్ల కారణంగా బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు వెండి ధరలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని జియోటస్ డాట్‌కామ్ సీఈఓ విక్రమ్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, డాలర్ బలపడటం విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం శుక్రవారం స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా పుంజుకుంది. ఔన్సుకు 27.21 డాలర్లు (ఒక శాతం) పెరిగి 3,904.87 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్‌లో మూడు శాతం పడిపోయిన బంగారం ధర 3,877.52 డాలర్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో కీలకమైన 4,000 డాలర్ల స్థాయికి దిగువకు పడిపోయింది. మరోవైపు వెండి ధర ఔన్సుకు 50.04 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగింది. గురువారం 52 వారాల కనిష్ట స్థాయిని తాకిన బంగారం ధర.. శుక్రవారం ఔన్సుకు 3,900 డాలర్ల స్థాయి వద్ద కదలాడిందని సౌమిల్ గాంధీ తెలిపారు.
విలువైన లోహాలపై ఒత్తిడికి కారణాలివే..
పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే ధోరణిలో మార్పులు, పారిశ్రామిక డిమాండ్‌పై అంచనాలు వెండి ధరల పతనానికి కారణమవుతున్నాయని విక్రమ్ సుబ్బరాజ్ విశ్లేషించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. ఇరాన్‌తో తక్షణమే దౌత్యపరమైన ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం అమెరికాకు లేదని ట్రంప్ వ్యాఖ్యానించడంతో శాంతి ఒప్పందంపై ఆశలు సన్నగిల్లాయి. దీంతో విలువైన లోహాల్లో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఇదిలా ఉండగా.. ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి ద్రవ్య విధాన నిర్ణయాలపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు అమెరికా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ), కోర్ పీపీఐ గణాంకాల కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికా డాలర్ కదలికల
నేపథ్యంలో విలువైన లోహాల ధరల్లో ఒడిదుడుకులు అధికంగానే ఉండొచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలకు మద్దతు లభిస్తోందని, ఇది ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచుతోందని తెలిపారు. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేయవచ్చన్న అంచనాలు కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం
నవంబర్ 14, 2026

Vemulawada | రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశం
నవంబర్ 14, 2026

Travel In November | ఫ్యామిలీ ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? చలికాలంలో సందర్శించాల్సిన 8 అద్భుతమైన పర్యాటక ప్రాంతాలివే..!
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి
- ●Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ 'భారత్ సమ్మిట్'! మళ్లీ తెరపైకి వీసా వివాదం

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!



