Mahaprabhu Jagannath | మహాప్రభు జగన్నాథ్ మూవీ రిలీజ్‌పై సుప్రీంకోర్టుకు మేకర్స్
Mahaprabhu Jagannath | దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన యానిమేటెడ్ చిత్రం 'మహాప్రభు జగన్నాథ్' రిలీజ్‌కు బ్రేక్ పడింది. దాంతో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒడిశా హైకోర్టు విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.
Entertainment | Published On Jul 16, 2026, 4.54 pm IST
- హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన నిర్మాతలు
Mahaprabhu Jagannath | దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన యానిమేటెడ్ చిత్రం 'మహాప్రభు జగన్నాథ్' రిలీజ్‌కు బ్రేక్ పడింది. దాంతో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒడిశా హైకోర్టు విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. రిలీజ్‌కు ముందు ఒడిశా హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది. రథయాత్ర సందర్భంగా సినిమాలో శ్రీ జగన్నాథ స్వామిని చూపించిన తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు రిలీజ్‌ను విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది.
హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ సీజేఐ బెంచ్ ఎదుట అత్యవసర ఈ విషయాన్ని ప్రస్తావించారు. వెంటనే విచారణ చేపట్టేందుకు నిరాకరించిన సీజేఐ.. శుక్రవారం పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించారు. దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ 'మహాప్రభు జగన్నాథ్' చిన్నారుల కోసం రూపొందించిన యానిమేషన్ చిత్రమని, దీనికి సీబీఎఫ్‌సీ ఇప్పటికే సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్-5 ప్రకారం సర్టిఫికెట్ జారీ చేసిందని తెలిపారు. స్కంద పురాణానికి అనుగుణంగా లేదనే కారణంతో సినిమా విడుదలను నిలిపివేయడంతో రూ.కోట్లలో పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా 300కుపైగా రిలీజ్ కోసం థియేటర్లను బుక్ చేశామని, చివరి క్షణంలో పిటిషన్ దాఖలు కావడంతో హైకోర్టు అత్యవసరంగా స్టే విధించిందని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 15న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణ ఉందని, అది మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా ఉండకూడదని కోర్టు తెలిపింది. అలాంటి పరిస్థితులు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటే న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడింది. రథయాత్ర జరుగుతున్న సమయంలో గజపతి మహారాజు, జగన్నాథ ఆలయ యాజమాన్యం ప్రత్యేక ప్రదర్శన అనంతరం సూచించిన మార్పులు చేయకుండానే సినిమాను విడుదల చేయడం సమంజసం కాదని కూడా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ తర్వాత రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
- ●వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
- ●Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి

Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన

వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'

Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!





