Trisha – Tamannaah | త్రిష కోసం ఫొటోగ్రాఫర్‌గా మారిన తమన్నా – మధ్యలో జయం రవి భార్య ఎందుకొచ్చింది?
చెన్నై క్వీన్ త్రిష కోసం మిల్కీ బ్యూటీ తమన్నా ఫొటోగ్రాఫర్‌గా మారింది. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ పెళ్లి వేడుకలో సరదాగా జరిగిన ఈ సంఘటన తాలూకు ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో త్రిష, తమన్నాతో పాటు జయం రవి భర్త ఆర్తి రవి కూడా కనిపించింది.
Entertainment | Published On Jul 17, 2026, 5.52 pm IST
Trisha - Tamannaah | సౌత్ స్టార్ హీరోయిన్లు త్రిష, తమన్నా మధ్య చాలా కాలంగా స్నేహం కొనసాగుతోంది. పలు సినిమా వేడుకలు, ప్రమోషనల్ ఈవెంట్లకు వీరిద్దరు కలిసి అటెండ్ అయిన ఫొటోలు చాలా సార్లు వైరల్ అయ్యాయి. సినిమాలకు అతీతమైనది వీరి ఫ్రెండ్‌షిప్ అని సన్నిహితులు చెబుతుంటారు. త్రిష తన లైఫ్‌లో స్పెషల్ పర్సన్ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా కామెంట్లు చేసింది. మిల్కీ బూటీని తన కుటుంబంలో ఓ సభ్యురాలిగానే భావిస్తానంటూ త్రిష చాలా సార్లు చెప్పింది.
ఫొటోలకు ఫోజులు...
కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి వేడుక ద్వారా మరోసారి త్రిష, తమన్నా స్నేహబంధంబయటపడింది. ఈ పెళ్లి వేడుకలకు కలిసే ఇద్దరూ అటెండ్ అయ్యారు. తాజాగా ఈ పెళ్లి వేడుకల తాలూకు కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
ఇందులో ఓ ఫొటోలో త్రిష కోసం తమన్నా ఫొటోగ్రాఫర్‌గా మారడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోలో త్రిష, తమన్నాతో పాటు జయం రవి భార్య ఆర్తి కూడా కనిపించింది. సరదాగా చెన్నై క్వీన్ ఆశీర్వాదం తీసుకుంటున్నట్లుగా ఆర్తి రవి ఫొటోకు ఫోజిచ్చింది. వారిద్దరి ఫొటోను ఫోన్‌లో తీస్తూ తమన్నా కనిపించింది. ఈ ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆర్తి రవికి మద్దతు....
ఈ ఫొటోతో త్రిష, ఆర్తి రవి మధ్య ఉన్న అనుబంధం ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. త్రిష ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఆర్తి రవి ఒకరు. త్రిష హీరోయిన్‌గా నటించిన పొన్నియన్ సెల్వన్‌తో పాటు మరికొన్ని సినిమాల సెట్స్‌లో ఆర్తి రవి కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అంతే కాకుండా త్రిష ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు ఆర్తి రవి అటెండ్ కావడం తప్పనిసరి అని అంటున్నారు. ఇటీవల జయం రవితో విడాకుల వివాదంలో ఆర్తికి రవికి త్రిషనే మద్దతుగా నిలిచినట్లు సమాచారం. మరోవైపు సీఎం విజయ్ విడాకుల వ్యవహారంలో త్రిష దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ టైమ్‌లో త్రిషకు సపోర్ట్‌గా ఆర్తి రవి కొన్ని పోస్ట్‌లు పెట్టింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jana Nayagan | జన నాయగన్ వచేస్తున్నాడు.. ఈ నెల 23న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్..
జులై 15, 2026

Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు – టీవీకే పార్టీ ప్రత్యర్థి నిర్మాత – కోలీవుడ్‌లో కొత్త రూమర్?
జులై 14, 2026

Sreeleela | ఎస్ఎస్ఎస్ – శ్రీలీల డ్రీమ్బాయ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!
జులై 13, 2026
తాజావార్తలు
- ●WhatsApp | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక మరింత స్పష్టంగా వాట్సాప్ కాల్స్..
- ●Supreme Court | చిన్నారి పట్ల మీకు జాలే లేదు.. పేరు ముందు డాక్టర్ బిరుదు తీసేయండి : సుప్రీంకోర్టు
- ●Srinivas Goud | రైతులపై కక్షనా..? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా..?
- ●PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్‌పై గురి..
- ●Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ - రూమర్లలో నిజమెంత?
- ●Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు

WhatsApp | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక మరింత స్పష్టంగా వాట్సాప్ కాల్స్..

Supreme Court | చిన్నారి పట్ల మీకు జాలే లేదు.. పేరు ముందు డాక్టర్ బిరుదు తీసేయండి : సుప్రీంకోర్టు

Srinivas Goud | రైతులపై కక్షనా..? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా..?

PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్‌పై గురి..



