Supreme Court | సుప్రీంకోర్టులో ఒక్కరోజే 400 కేసులకు పరిష్కారం
Supreme Court | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఒక్కరోజే ఏకంగా 400 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ (Special Lok Adalat) పరిష్కరించింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఒక్కరోజే ఏకంగా 400 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ (Special Lok Adalat) పరిష్కరించింది. పెండింగ్‌లో ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Chief Justice of India Surya Kant) మార్గదర్శకత్వంలో 'సమాధాన్ సమరోహ్ 2026' కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 21న ప్రారంభమైన ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ఆగస్టు 23వరకూ కొనసాగనుంది.
ఈ కార్య్రమంలో భాగంగా 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌ల ముందు 600కుపైగా కేసులు విచారణ వచ్చాయి. సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన ఇద్దరు సిట్టింగ్ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, అడ్వొకేట్-ఆన్-రికార్డ్ (AORలు), ఇతర న్యాయవాదులు డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ బెంచ్‌ల ద్వారా తొలిరోజే 400 కేసులకు పరిష్కారం లభించింది.
వీటిలో భార్యాభర్తల గొడవలు, ఆస్తి తగాదాలు, వాహన ప్రమాద క్లెయిమ్‌లు, నష్టపరిహారం, భూసేకరణ - పరిహారాలు, పన్ను, కార్మిక వివాదాలు వంటి వివిధ అంశాలు ఉన్నాయి. పరస్పర చర్చల ద్వారా ఇరువర్గాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఈ బెంచ్‌లు ఎంతగానో తోడ్పడ్డాయి. పెండింగ్‌లో ఉన్న వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పించడమే ఈ ప్రత్యేక లోక్ అదాలత్ లక్ష్యమని సుప్రీంకోర్టు (Supreme Court) ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read..
రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే
అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Janhvi Kapoor | అమ్మానాన్నల పెళ్లి స్వర్గంలోనే.. జాన్వీ చిన్ననాటి కామెంట్స్ వైరల్..
- ●Manan Kumar Mishra | రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే
- ●Jupally Krishna Rao | ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ..
- ●bus ploughs into crowd | జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి
- ●Forest | హెచ్ఐవీ సోకిందని మహిళను అడవిలో వదిలేశారు..
- ●Microsoft | మైక్రోసాఫ్ట్‌కు తొలి వెరా రూబిన్ ఏఐ ప్లాట్‌ఫామ్.. కీలక మైలురాయి..

Janhvi Kapoor | అమ్మానాన్నల పెళ్లి స్వర్గంలోనే.. జాన్వీ చిన్ననాటి కామెంట్స్ వైరల్..

Manan Kumar Mishra | రూ.150 కోట్ల స్కాం.. ఫ్యామిలీకే పదవులు : బీసీఐ చైర్మన్ మనన్ 15 రోజుల్లో రాజీనామా చేయాల్సిందే

Jupally Krishna Rao | ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ..

bus ploughs into crowd | జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి






