Jupally Krishna Rao | ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ..
Jupally Krishna Rao | ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగాపర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముందుకు సాగుతున్నారు. తన నియోజకవర్గమైన కొల్లాపూర్‌లో గత మూడు రోజులుగా విస్తృత పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుకుంటూ పరిష్కార సాధ్యమైన సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నారు.
- కొల్లాపూర్ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు విస్తృత పర్యటన
- రెవెన్యూ సమస్యల జాప్యంపై అధికారులపై ఆగ్రహం
- ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ఆదేశం
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగాపర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముందుకు సాగుతున్నారు. తన నియోజకవర్గమైన కొల్లాపూర్‌లో గత మూడు రోజులుగా విస్తృత పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుకుంటూ పరిష్కార సాధ్యమైన సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధి, సంక్షేమంపై సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జవాబుదారీతనం కొరవడితే సహించేది లేదని అధికారులను హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించనని తేల్చి చెబుతున్నారు.
ఇందులో భాగంగా శనివారం పెంట్లవెల్లిలో స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొల్లాపూర్ పట్టణంతో పాటు వీపనగండ్ల, పానగల్ మండలం కేతపల్లి గ్రామం, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో స్టేడియాల నిర్మాణానికి కసరత్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని, అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మ్యూటేషన్లకు ఏళ్ల తరబడి తిప్పించుకోవడమేంటి?
అనంతరం పెంట్లవెల్లి మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. ప్రజలు, రైతులు తమ సమస్యలను మంత్రికి వివరించగా.. ఆయన ఓపికగా విని వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై పలువురు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మ్యూటేషన్ల కోసం దీర్ఘకాలంగా మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలపై మంత్రి జూపల్లి తీవ్రంగా స్పందించారు. ఏళ్ల తరబడి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వస్తే సత్వరం పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జవాబుదారీతనంతో పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, క్షేత్రస్థాయిలోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తన పర్యటనల ఉద్దేశమని మంత్రి తెలిపారు.
స్టేడియాల నిర్మాణానికి కసరత్తు
కొల్లాపూర్ నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజల ఆశీర్వాదమే బలం
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. 25 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, ఏ రోజు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, ఇంచు భూమి కూడా కబ్జా చేయలేదని, ఏ పనికీ ఒక్క పైసా తీసుకోలేదని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తున్నానని, అందుకే ప్రజలు సుదీర్ఘకాలంగా తనను ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బాధ్యతగా పనిచేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, క్షేత్రస్థాయిలోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తన పర్యటనల ఉద్దేశమని తెలిపారు.
తాజావార్తలు
- ●Revanth Reddy London Tour | లండన్లో సీఎం.. తెలంగాణలో ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం లివర్పూల్తో డీల్
- ●Bhagwant Mann | అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు
- ●Raghunandan Rao | తన కుర్చీ కిందకు నీళ్లు తెస్తున్నారనే.. అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
- ●Rajasthan Schools | సీజేపీ తనిఖీలతో వెలుగులోకి రాజస్థాన్ ప్రభుత్వ బడుల దుస్థితి.. 611 పాఠశాలలకు సొంత భవనాలు లేవని అంగీకరించిన సర్కార్
- ●PPF | పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తెరవచ్చా.. ఏమేం సదుపాయాలు ఉంటాయి..?
- ●Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్ల వైపు పెట్టుబడిదారుల చూపులు..

Revanth Reddy London Tour | లండన్లో సీఎం.. తెలంగాణలో ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం లివర్పూల్తో డీల్

Bhagwant Mann | అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు

Raghunandan Rao | తన కుర్చీ కిందకు నీళ్లు తెస్తున్నారనే.. అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

Rajasthan Schools | సీజేపీ తనిఖీలతో వెలుగులోకి రాజస్థాన్ ప్రభుత్వ బడుల దుస్థితి.. 611 పాఠశాలలకు సొంత భవనాలు లేవని అంగీకరించిన సర్కార్







