త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

bus ploughs into crowd | జ‌నంపైకి దూసుకెళ్లిన బ‌స్సు.. ఐదుగురు మృతి

bus ploughs into crowd | బీహార్‌లో ఓ బ‌స్సు అదుపుత‌ప్పి జ‌నాల‌పైకి దూసుకెళ్లింది (bus ploughs into crowd). ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Aug 22, 2026, 12.57 pm IST

bus ploughs into crowd | జ‌నంపైకి దూసుకెళ్లిన బ‌స్సు.. ఐదుగురు మృతి
Advertisement

bus ploughs into crowd | త్రినేత్ర‌.న్యూస్ : బీహార్‌లో (Bihar) ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ బ‌స్సు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న జ‌నాల‌పైకి దూసుకెళ్లింది (bus ploughs into crowd). ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెస్ట్ చంపారణ్ జిల్లా (West Champaran district)లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లౌరియా పోలీసు స్టేషన్ పరిధిలోని పరాటోలా వద్ద ఉన్న లౌరియా మార్గ్‌లో శుక్ర‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఓ సాంస్కృతిక కార్య‌క్ర‌మాన్ని తిల‌కించేందుకు (cultural programme) జ‌నం పెద్ద సంఖ్య‌లో గుమిగూడారు. అదే స‌మ‌యంలో అటుగా వ‌స్తున్న బ‌స్సు ఎదురుగా వ‌స్తున్న ట్రక్కును త‌ప్పించే క్ర‌మంలో డ్రైవ‌ర్ వాహ‌నంపై నియంత్ర‌ణ కోల్పోయాడు. దీంతో బ‌స్సు జ‌నాల‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌డిన‌ట్లు నర్కటియాగంజ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి (SDPO) అజయ్ ప్రకాష్ సింగ్ తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

Also Read..

అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్‌.. పంజాబ్ సీఎం భార్య‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

సీజేపీ త‌నిఖీల‌తో వెలుగులోకి రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ బ‌డుల దుస్థితి.. 611 పాఠ‌శాల‌ల‌కు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అంగీక‌రించిన స‌ర్కార్‌

మైక్రోసాఫ్ట్‌కు తొలి వెరా రూబిన్ ఏఐ ప్లాట్‌ఫామ్.. కీలక మైలురాయి..

Advertisement
Advertisement