త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DPDP Act | ప‌త్రికా స్వేచ్ఛకు ముప్పేమీ లేదు.. డీపీడీపీ చట్టంపై అశ్విని వైష్ణవ్ కామెంట్స్‌

DPDP Act | డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (Digital Personal Data Protection Act–DPDP) వల్ల జర్నలిజం స్వేచ్ఛకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛను దెబ్బతీసే ఉద్దేశం గానీ, అందుకు సంబంధించిన నిబంధనలు గానీ ఈ చట్టంలో లేవని వెల్లడించారు. వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు వార్తా సేకరణ, ప్రచురణ స్వేచ్ఛకు ఈ చట్టం అడ్డంకి కాదని పేర్కొన్నారు.

P

National | Published On Oct 28, 2026, 5.47 pm IST

DPDP Act | ప‌త్రికా స్వేచ్ఛకు ముప్పేమీ లేదు.. డీపీడీపీ చట్టంపై అశ్విని వైష్ణవ్ కామెంట్స్‌
Advertisement

DPDP Act | డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (Digital Personal Data Protection Act–DPDP) వల్ల ప‌త్రికా స్వేచ్ఛకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛను దెబ్బతీసే ఉద్దేశం గానీ, అందుకు సంబంధించిన నిబంధనలు గానీ ఈ చట్టంలో లేవని వెల్లడించారు. వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు వార్తా సేకరణ, ప్రచురణ స్వేచ్ఛకు ఈ చట్టం అడ్డంకి కాదని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా చట్టం

వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే డీపీడీపీ చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఈ చట్టం రూపకల్పనలో భాగంగా నెల రోజుల పాటు విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపామని, మీడియా రంగం కూడా వాటిలో పాల్గొందని తెలిపారు. జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే అంశాలేవీ చట్టంలో లేవని స్పష్టం చేశారు. వార్తలో ప్రస్తావించే వ్యక్తి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని జర్నలిస్టులను ఈ చట్టం కోరడం లేదని, వార్తా మూలాలను (Sources) వెల్లడించాలనే నిబంధన కూడా లేదని వైష్ణవ్‌ పేర్కొన్నారు. మీడియా సంస్థలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను తోసిపుచ్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన డీఎన్‌పీఏ

డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ (DNPA) డీపీడీపీ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సంస్థలో 21 ప్రముఖ వార్తా సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. జర్నలిజానికి ప్రత్యేక మినహాయింపు కల్పించకపోవడం వల్ల పరిశోధనాత్మక కథనాలు (Investigative Journalism), ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వార్తల ప్రచురణపై ప్రభావం పడే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై మంగళవారం స్పందించిన సుప్రీంకోర్టు కేంద్రం స్పంద‌న‌కోరింది.

ఆగ‌స్టులో డీపీడీపీ చ‌ట్టం..

2023 ఆగస్టులో పార్లమెంట్‌ ఆమోదించిన డీపీడీపీ చట్టం.. దేశంలో డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించిన సమగ్ర చట్టం. వ్యక్తుల సమ్మతితో లేదా చట్టంలోని సెక్షన్‌ 7లో పేర్కొన్న నిర్దిష్ట చట్టబద్ధ ప్రయోజనాల (Legitimate Uses) కింద వ్యక్తిగత డేటాను వినియోగించేందుకు ఇది అనుమతిస్తుంది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించే క్రమంలో మీడియా స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకాలు క‌లువ‌గ‌వ‌ని కేంద్రం వాదిస్తోంది.

Advertisement
Advertisement