త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌.. బులియ‌న్ మార్కెట్లలో తీవ్ర అస్థిర‌త‌..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు, భౌగోళిక రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా ముడి చ‌మురు ధ‌ర‌లు అధిక స్థాయిల్లో ఉన్న‌ప్ప‌టికీ దేశీయ ఈక్విటీ సూచీలు మాత్రం భారీ లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే బులియ‌న్ మార్కెట్లలో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. ఈ వారంలో బంగారం, వెండి ధ‌ర‌లు తీవ్ర హెచ్చుత‌గ్గుల‌తో కొన‌సాగుతున్నాయి.

S

Business | Published On Oct 30, 2026, 11.53 am IST

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌.. బులియ‌న్ మార్కెట్లలో తీవ్ర అస్థిర‌త‌..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు, భౌగోళిక రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా ముడి చ‌మురు ధ‌ర‌లు అధిక స్థాయిల్లో ఉన్న‌ప్ప‌టికీ దేశీయ ఈక్విటీ సూచీలు మాత్రం భారీ లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే బులియ‌న్ మార్కెట్లలో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. ఈ వారంలో బంగారం, వెండి ధ‌ర‌లు తీవ్ర హెచ్చుత‌గ్గుల‌తో కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.82 శాతం త‌గ్గి 3,988 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 2.28 శాతం మేర ప‌త‌న‌మై 50 డాల‌ర్ల‌కు చేరుకుంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 596 పాయింట్లు త‌గ్గి 1,41,970కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3632 పాయింట్లు త‌గ్గి 1,85,821కు చేరుకుంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ఒక్క రోజులోనే ప‌సిడి ధ‌ర రూ.17వేల మేర త‌గ్గింది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,226 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,13,808 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,42,260 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,22,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.16,900 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,040 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,04,320గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,30,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,04,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.15,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,669 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.85,352గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,06,690 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,66,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.12,700 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,10,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,100గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర కిలోకు రూ.5వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,10,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,100 గా ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement