Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి..
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారిని ఆదుకోవాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయాలి
మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Srinivas Goud | త్రినేత్ర న్యూస్ : ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారిని ఆదుకోవాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
తుంగభద్ర నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ పరిధిలోని 12 నుంచి 22వ డిస్ట్రిబ్యూటరీ గ్రావిటీ కెనాల్స్ కింద సాగవుతున్న సుమారు 10 వేల ఎకరాలకు చివరి తడులు అందడం లేదు. తుమ్మిళ్ల లిఫ్ట్ పరిధిలో మరో 10 వేల ఎకరాలకు కూడా చివరి తడులు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్‌కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించాలి. కనీసం రెండు తడులకు సరిపడా నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలి. తెలంగాణకు హక్కుగా రావాల్సిన తుంగభద్ర జలాలను తక్షణమే విడుదల చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతులు తీవ్రంగా నష్టపోకముందే ప్రభుత్వం స్పందించి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Megastar Chiranjeevi | సంక్రాంతి బరిలోకి మెగాస్టార్.. ఈ సారైనా ‘విశ్వంభర’ వస్తాడా?
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట
- ●Ruhani Sharma | రుహానీ శర్మలో మరో యాంగిల్.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్!
- ●CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి
- ●Indian Rare Earth Stocks | 2027లో దృష్టి పెట్టాల్సిన 5 అరుదైన ఖనిజాల స్టాక్స్.. భారీ వృద్ధికి అవకాశాలు..
- ●ACB | ఏసీబీలో అవినీతికి ఆస్కారం లేదు.. విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ

Megastar Chiranjeevi | సంక్రాంతి బరిలోకి మెగాస్టార్.. ఈ సారైనా ‘విశ్వంభర’ వస్తాడా?

Rahul Gandhi | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Ruhani Sharma | రుహానీ శర్మలో మరో యాంగిల్.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్!

CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి





