Hyderabad | బాణసంచా దుకాణానికి దరఖాస్తు చేసుకోండిలా.. కావాల్సిన ధృవపత్రాలు ఇవే..
Hyderabad | దీపావళి( Diwali ) పండుగకు ఇక వారం రోజులే మిగిలి ఉంది. ఈ పండుగకు పిల్లలు, పెద్దలు హుషారుగా బాణసంచా( Crackers ) కాల్చి ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్( Hyderabad ) వ్యాప్తంగా టపాసుల దుకాణాల సందడి మొదలవుతుంది. అయితే ఈ దుకాణాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఫైర్ సర్వీసెస్( Fire Services ) అధికారుల నుంచి అనుమతి పొందాల్సిందే.
Hyderabad | త్రినేత్ర న్యూస్ : దీపావళి( Diwali ) పండుగకు ఇక వారం రోజులే మిగిలి ఉంది. ఈ పండుగకు పిల్లలు, పెద్దలు హుషారుగా బాణసంచా( Crackers ) కాల్చి ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్( Hyderabad ) వ్యాప్తంగా టపాసుల దుకాణాల సందడి మొదలవుతుంది. అయితే ఈ దుకాణాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఫైర్ సర్వీసెస్( Fire Services ) అధికారుల నుంచి అనుమతి పొందాల్సిందే. బాణసంచా విక్రయించే తాత్కాలిక దుకాణాలు అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ముందస్తుగా ఫైర్ సర్వీస్ లైసెన్స్ పొందడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
- అగ్నిమాపక శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి. హోమ్ పేజీలో ‘అప్లై ఫర్ ఫైర్ సర్వీస్ లైసెన్స్ (ఫైర్ క్రాకర్స్)’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- లాగిన్ విండోలో ‘రిజిస్టర్’పై క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, చిరునామా వివరాలను నమోదు చేస్తే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి.
- కొత్తగా నమోదైన ఐడీతో లాగిన్ అయ్యాక ‘ఫైర్ లైసెన్స్’పై క్లిక్ చేయాలి.
- అనంతరం అప్లికేషన్ కేటగిరీలో ‘టెంపరరీ ఫైర్ క్రాకర్స్ షాప్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- దరఖాస్తు ఫారంలో దుకాణం పేరు, చిరునామాతో పాటు సదరు దుకాణ స్థలానికి చుట్టుపక్కల 20 మీటర్ల పరిధిలో నలువైపులా ఏయే నిర్మాణాలున్నాయో పేర్కొనాలి. ఆపై పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
అప్‌లోడ్ చేయాల్సిన ధృవపత్రాలు ఇవే..
- చిరునామా కోసం ఆధార్ కార్డు లేదా ఓటరు కార్డ్
- గుర్తింపు కోసం పాన్ కార్డు లేదా ఓటరు కార్డ్
- దరఖాస్తుదారుడి ఫొటో
ఫీజు చెల్లింపు ఇలా..
దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక డాష్‌బోర్డ్‌లోని ‘స్టేటస్’ ఆప్షన్‌కు వెళ్లి ‘పేమెంట్’పై క్లిక్ చేయాలి. లైసెన్స్ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఫీజు చెల్లించాక సంబంధిత అగ్నిమాపక శాఖాధికారి దుకాణం ఏర్పాటు చేసే స్థలాన్ని సందర్శించి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తారు. అన్ని నిబంధనలూ పాటిస్తున్నారని నిర్ధారించుకున్నాకే దరఖాస్తు ఆమోదిస్తారు. ఆ తర్వాత వ్యాపారులు పోర్టల్ నుంచి డిజిటల్ లైసెన్స్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rain Alert | నేడు నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..!
- ●CM Revanth Reddy | ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యం
- ●Tiger centipede | కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో అరుదైన జెర్రి
- ●November Lucky Horoscope | నవంబర్‌లో ఈ 4 రాశులకు అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!
- ●Horoscope | నవంబర్ 3 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభనష్టాలు..!
- ●Mahesh Kumar Goud Slams Amit Shah | హైదరాబాద్‌లో సభలు కాదు.. తెలంగాణకు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి

Rain Alert | నేడు నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..!

CM Revanth Reddy | ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యం

Tiger centipede | కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో అరుదైన జెర్రి

November Lucky Horoscope | నవంబర్‌లో ఈ 4 రాశులకు అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!




