త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Rate | దీపావళి వేళ మళ్లీ మెరిసిన బంగారం.. ధరలు ఎంత పెరిగాయంటే..?

Gold Rate | దీపావళి పండుగ వేళ బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అక్టోబర్‌లో భారీగా పడిపోయిన పసిడి ధరలకు పండుగ కొనుగోళ్లు ఊతమిచ్చాయి. జువెల్లరీ వ్యాపారులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం బంగారం ధరలు పెరిగాయి.

P

Business | Published On Nov 2, 2026, 7.50 pm IST

Gold Rate | దీపావళి వేళ మళ్లీ మెరిసిన బంగారం.. ధరలు ఎంత పెరిగాయంటే..?
Advertisement

Gold Rate | దీపావళి పండుగ వేళ బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అక్టోబర్‌లో భారీగా పడిపోయిన పసిడి ధరలకు పండుగ కొనుగోళ్లు ఊతమిచ్చాయి. జువెల్లరీ వ్యాపారులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో రూపాయి మారకం విలువలో కదలికలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర సోమవారం రూ.500 పెరిగి రూ.1,42,500కు చేరింది. మరోవైపు వెండి ధ‌ర మాత్రం మార‌లేదు. ప్ర‌స్తుతం రూ.1.86 లక్షల వద్ద కొన‌సాగుతోంది.

అక్టోబర్ పతనం తర్వాత కోలుకున్న పసిడి

అక్టోబర్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30న 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,300 ఉండగా.. అక్టోబర్‌లో ఏకంగా రూ.7,300 తగ్గింది. కిలో వెండి ధర కూడా రూ.2.32 లక్షల నుంచి రూ.46 వేలు పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజా పెరుగుదల మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చింది. మ‌రో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ విలువైన లోహాల ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 24.18 డాలర్లు పెరిగి 3,899.73 డాలర్లకు చేరింది. వెండి ధర 2 శాతానికి పైగా పెరిగి ఔన్సుకు 50.25 డాలర్ల వద్దకు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితి, వడ్డీ రేట్లపై అంచనాలు, ముడి చమురు ధరలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

మున్ముందు ఎలా ఉండొచ్చు?

రానున్న రోజుల్లో బులియన్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 4,000 డాలర్ల దిగువన ఉండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దీపావళి నేపథ్యంలో దేశీయంగా పెరుగుతున్న కొనుగోళ్లు బంగారం ధరలకు అండగా నిలుస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరల్లో పెద్దగా పెరుగుదల లేదా తగ్గుదల ఉండకపోవచ్చని, స్వల్ప హెచ్చుతగ్గులతో స్థిరంగా కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్:

DelhiDiwaliGold MarketGold PriceGold Price HikeGold Prices TodayGold Rate TodayHyderabadSilver PriceTelugu News
Advertisement
Advertisement