త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఢిల్లీలో ఇంట‌ర్నెట్‌, మెట్రో సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రించండి : సుప్రీంకోర్టు

Supreme Court | స‌ర్( SIR ) ప్ర‌క్రియను వ్య‌తిరేకిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్( Jnanesh Kumar ) రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ( CJP ) చేప‌ట్టిన ఆందోళ‌న నేప‌థ్యంలో పోలీసులు ఇంట‌ర్నెట్, మెట్రో సేవ‌ల‌ను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.

S

National | Published On Oct 11, 2026, 1.09 pm IST

Supreme Court | ఢిల్లీలో ఇంట‌ర్నెట్‌, మెట్రో సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రించండి : సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : స‌ర్( SIR ) ప్ర‌క్రియను వ్య‌తిరేకిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్( Jnanesh Kumar ) రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ( CJP ) చేప‌ట్టిన ఆందోళ‌న నేప‌థ్యంలో పోలీసులు ఇంట‌ర్నెట్, మెట్రో సేవ‌ల‌ను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పోలీసుల చ‌ర్య‌ల‌పై ప‌లువురు న్యాయ‌వాదులు సుప్రీంకోర్టు( Supreme Court )లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ జ‌య‌మాల్య బాగ్చి, జ‌స్టిస్ వీ మోహ‌న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఢిల్లీలో ఇంట‌ర్నెట్, మెట్రో సేవ‌లు పున‌రుద్ధ‌రించాల‌ని కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. ఇక బారికేడ్ల‌ను తొల‌గించాల‌ని కోర్టు ఆదేశించింది. అదే విధంగా సుప్రీంకోర్టు ప‌రిస‌రాల‌తో పాటు ఇత‌ర కోర్టుల వ‌ద్ద 163 సెక్ష‌న్ విధించిన‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, త‌క్ష‌ణ‌మే ఆ సెక్ష‌న్‌ను ఎత్తివేయాల‌ని కోర్టు ఆదేశించింది. న్యాయం కోసం వ‌చ్చే ప్ర‌జ‌లకు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా చూడాల‌ని కోర్టు తెలిపింది. లాయ‌ర్ల విధుల‌కు ఆటంకం సృష్టించొద్ద‌ని చెప్పింది. ఇక ప్ర‌జ‌ల‌కు నిర‌స‌న తెలిపే హ‌క్కు ఉంది. కానీ పోలీసు చ‌ట్టాల‌కు లోబ‌డి నిర‌స‌న‌లు తెలియ‌జేయాల‌ని సూచించింది. అక్టోబ‌ర్ 10న ఏ ఆంక్ష‌లు విధించారు..? ఎందుకు విధించారు..? అనే దానిపై మంగ‌ళ‌వారం లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement