Income Tax Return | ఐటీఆర్ ఫైల్ చేశారా.. వెరిఫికేషన్‌కు మరో 30 రోజులే గడువు..
Income Tax Return | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం మాత్రమే సరిపోదు. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని తప్పనిసరిగా వెరిఫై చేయాలి. పన్ను చెల్లింపుదారు తన ఐటీఆర్‌ను వెరిఫై చేయనంత వరకు ఆదాయపు పన్ను శాఖ దానిపై తదుపరి ప్రాసెసింగ్‌ను ప్రారంభించదు.
Income Tax Return | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం మాత్రమే సరిపోదు. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని తప్పనిసరిగా వెరిఫై చేయాలి. పన్ను చెల్లింపుదారు తన ఐటీఆర్‌ను వెరిఫై చేయనంత వరకు ఆదాయపు పన్ను శాఖ దానిపై తదుపరి ప్రాసెసింగ్‌ను ప్రారంభించదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐటీఆర్ దాఖలు చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. నిర్ణీత గడువులో ఈ ప్రక్రియ పూర్తికాకపోతే ఐటీఆర్‌ను చెల్లనిదిగా పరిగణించే అవకాశం ఉంటుంది. అందువల్ల సకాలంలో వెరిఫికేషన్ చేయడం చాలా కీలకం. ఈ ప్రక్రియలో ఈ-వెరిఫికేషన్ ను అత్యంత సులభమైన, వేగవంతమైన విధానంగా పరిగణిస్తారు. దీనివల్ల పోస్టు ద్వారా ఎలాంటి పత్రాలు పంపాల్సిన అవసరం ఉండదు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది.
30 రోజులే గడువు..
ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత అది ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. అయితే పన్ను చెల్లింపుదారు విజయవంతంగా వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతే రిటర్న్ ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. గతంలో ఐటీఆర్ దాఖలు చేసిన అనంతరం వెరిఫికేషన్‌కు 120 రోజుల గడువు ఉండేది. కానీ 2022 ఆగస్టు 1 నుంచి ఈ రూల్ ను మార్చారు. దీంతో అప్పటి నుంచి రిటర్న్ దాఖలు చేసిన తరువాత పన్ను చెల్లింపుదారులకు 30 రోజుల గడువే ఇస్తున్నారు. అందువల్ల ఐటీఆర్‌ను ప్రస్తుతం దాఖలు చేసినవారు వచ్చే ఆగస్టు చివర్లోగా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే రిటర్న్ ప్రాసెసింగ్ అవదు. తరువాత జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
ఎలా చేయాలి..
ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేసేందుకు ఐదు సులభమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఆన్‌లైన్‌లో ఐటీఆర్ వెరిఫికేషన్ కోసం పలు సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. ఆధార్ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయవచ్చు. మొబైల్ నంబర్ ఆధార్‌కు లింక్ అయి ఉంటే, ఆ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ద్వారా ఐటీఆర్‌ను వెరిఫై చేయవచ్చు. ముందుగా ప్రీ-వాలిడేట్ చేసిన బ్యాంక్ ఖాతా ఉంటే, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) జనరేట్ చేసి ఐటీఆర్‌ను వెరిఫై చేయవచ్చు. ప్రీ-వాలిడేట్ చేసిన డీమ్యాట్ ఖాతా ఉన్న పన్ను చెల్లింపుదారులు కూడా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈవీసీ సృష్టించి ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. అధీకృత బ్యాంకుల ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయి, ప్రత్యేకంగా ఓటీపీ లేదా ఈవీసీ అవసరం లేకుండానే నేరుగా ఐటీఆర్‌ను వెరిఫై చేయవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) నమోదు చేసుకున్న పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా కొన్ని వ్యాపార సంస్థలు, నిపుణులు డీఎస్సీ ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ చేయవచ్చు.
ఆఫ్‌లైన్‌లోనూ చేయవచ్చా..
ఈ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత స్క్రీన్‌పై సక్సెస్ మెసేజ్‌తో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ కనిపిస్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి నిర్ధారణ ఈ-మెయిల్ ను కూడా పంపిస్తారు. అయితే ఆఫ్‌లైన్‌లో కూడా ఐటీఆర్ ను వెరిఫికేషన్ చేయవచ్చు. కానీ ఇందుకు కాస్త సమయం పడుతుంది. ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ చేయడానికి ఇష్టపడని వారు ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా ఐటీఆర్-వి అక్నాలెడ్జ్‌మెంట్‌ను ప్రింట్ తీసుకోవాలి. దానిపై సంతకం చేసి, ఐటీఆర్ దాఖలు చేసిన 30 రోజులలోపు బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)కి పోస్టు ద్వారా పంపించాలి. అయితే పోస్టల్ జాప్యం లేదా పత్రాలు పోయే ప్రమాదం ఉంటుంది కనుక ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్‌లోనే చాలా సురక్షితంగా, వేగంగా వెరిఫికేషన్ చేయవచ్చు.
సకాలంలో ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. దీని వల్ల ఐటీఆర్ చెల్లుబాటు అవుతుంది. ఆదాయపు పన్ను శాఖ రిటర్న్ ప్రాసెసింగ్‌ను వెంటనే ప్రారంభిస్తుంది. రిఫండ్ రావాల్సి ఉంటే త్వరగా అందే అవకాశం పెరుగుతుంది. అలాగే సీపీసీ, బెంగళూరుకు ఐటీఆర్-వి హార్డ్ కాపీ పంపాల్సిన అవసరం ఉండదు.
సంబంధిత వార్తలు

Income Tax Return | ఐటీఆర్ గడువును పెంచారా..? ట్యాక్స్ పేయర్లకు కొత్త గడువు తేదీ..?
జులై 25, 2026

ITR | స్టాక్ మార్కెట్ ట్రేడర్లు ఐటీఆర్‌లో వివరాలను నమోదు చేయాలా.. తెలుసుకోవాల్సిన విషయాలు..
జులై 22, 2026

ITR | ఎఫ్‌డీల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలా.. ఐటీఆర్‌లో ఎలా నమోదు చేయాలి..?
జులై 20, 2026
తాజావార్తలు
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
- ●ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు
- ●Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..
- ●E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం
- ●Drugs | డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..
- ●Supreme Court | ఆందోళన చేస్తున్నంతమాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదు : సుప్రీంకోర్టు

Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు

Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..

E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం



