త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోష్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య రెండు రోజుల నుంచి యుద్ధ ఉద్రిక్త‌త‌లు త‌గ్గ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో పాజిటివ్ సంకేతాలు వ‌చ్చాయి. సోమ‌వారం మార్కెట్లు భారీ లాభాల్లో కొన‌సాగుతుండ‌గా, బులియ‌న్ మార్కెట్ల‌లోనూ జోష్ క‌నిపించింది. బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి.

S

Business | Published On Jul 27, 2026, 11.07 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోష్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య రెండు రోజుల నుంచి యుద్ధ ఉద్రిక్త‌త‌లు త‌గ్గ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో పాజిటివ్ సంకేతాలు వ‌చ్చాయి. సోమ‌వారం మార్కెట్లు భారీ లాభాల్లో కొన‌సాగుతుండ‌గా, బులియ‌న్ మార్కెట్ల‌లోనూ జోష్ క‌నిపించింది. బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.85 శాతం మేర ఎగ‌బాకి 4,086 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 1.82 శాతం మేర ఎగ‌సి 59 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 894 పాయింట్ల‌కు పైగా పెరిగి 1,44,000 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2,016 పాయింట్ల‌కు పైగా పెరిగి 2,24,236 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు భారీగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,586 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16, 688గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,45,860 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,58,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.9,300 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,370 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,06,960గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,33,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,37,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,939 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.87,512గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,09,390 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,93,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,900 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌రలో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400 గా ఉంది.

Advertisement
Advertisement