త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBSE | విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ప‌రీక్ష‌ తేదీల‌ను ప్ర‌క‌టించిన సీబీఎస్ఈ బోర్డు

CBSE | 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి ప్రాక్టికల్, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షల తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్ర‌క‌టించింది. శీతాకాలం కారణంగా పాఠశాలలు మూసివేసే (winter bound schools) ప్రాంతాల్లో ఈ పరీక్షలను నవంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు నిర్వహించనున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ఆయా పాఠ‌శాల‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేసింది. విద్యార్థులు అధికారిక CBSE వెబ్‌సైట్ cbse.gov.inలో ప్రాక్టికల్ పరీక్షా తేదీలను చూసుకోవచ్చు.

D

National | Published On Nov 6, 2026, 1.08 pm IST

CBSE | విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. ప‌రీక్ష‌ తేదీల‌ను ప్ర‌క‌టించిన సీబీఎస్ఈ బోర్డు
Advertisement

CBSE | త్రినేత్ర న్యూస్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి ప్రాక్టికల్, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షల తేదీలను ప్రకటించింది. శీతాకాలం కారణంగా పాఠశాలలు మూసివేసే ప్రాంతాల్లో (winter bound schools) ఈ పరీక్షలను నవంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు నిర్వహించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. విద్యార్థులు అధికారిక CBSE వెబ్‌సైట్ cbse.gov.inలో ప్రాక్టికల్ పరీక్షా తేదీలను చూసుకోవచ్చు.

ఈ సంద‌ర్భంగా వింట‌ర్ బౌండ్ పాఠ‌శాల‌ల‌కు సీబీఎస్ఈ బోర్డు కీల‌క సూచ‌న‌లు చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లను ( practical examination schedule) నిర్వహించే ముందు అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేయాలని సీబీఎస్‌ఈ వింటర్‌-బౌండ్ పాఠశాలలను ఆదేశించింది. ఆన్‌లైన్ ద్వారా అభ్య‌ర్థుల జాబితాలో పేర్లు స‌మ‌ర్పించిన విద్యార్థుల‌ను మాత్ర‌మే ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తించాల‌ని స్ప‌ష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి ప్రణాళిక, తేదీల వివరాలను ఆయా పాఠశాలలు ఆన్‌లైన్ పోర్టల్‌లో ముందుగానే అప్‌లోడ్ చేయాల‌ని సూచించింది.

10వ తరగతి ఇంటర్నల్ అసెస్‌మెంట్ కేవలం ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది. పాఠశాలలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అర్హులైన అభ్యర్థులందరి మూల్యాంకనాన్ని పూర్తి చేసి, మార్కులను అప్‌లోడ్ చేయాలని తెలిపింది. అవసరమైన చోట ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లు, అబ్జర్వర్ల నియామకం కోసం సంబంధిత సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించాల‌ని పాఠశాలలకు సూచించింది. ప‌రీక్ష‌లు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని పాఠశాలలను ఆదేశించింది. 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల ఆన్సర్ బుక్స్‌ను సూచనల ప్రకారం సంబంధిత సీబీఎస్‌ఈ ప్రాంతీయ కార్యాలయాలకు పంపాలని తెలిపింది. 30 మంది విద్యార్థులకంటే ఎక్కువ మంది ఉన్న పాఠశాలలు ల్యాబ్ సౌకర్యాలను బట్టి రోజుకు రెండు లేదా మూడు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

ఈ షెడ్యూల్ అన్ని పాఠ‌శాల‌ల‌కు వ‌ర్తించ‌ద‌ని బోర్డు స్ప‌ష్టం చేసింది. జ‌మ్ము క‌శ్మీర్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ స‌హా కొన్ని కొండ ప్రాంతాల్లో జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో భారీగా మంచు కురుస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని పాఠ‌శాల‌ల‌ను సుమారు రెండు నెల‌లపాటూ మూసివేస్తారు. కాబ‌ట్టి, ఆయా ప్రాంతాల్లో ప‌రీక్ష‌ల‌ను ముందుగానే నిర్వ‌హిస్తారు. ఇక సాధారణ విద్యా విధానాన్ని (Regular Academic Session) అనుసరించే పాఠశాలల ప్రాక్టికల్ పరీక్షలు, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ల కోసం త్వ‌ర‌లోనే వేరుగా మ‌రో షెడ్యూల్‌ను జారీ చేయ‌నున్న‌ట్లు సీబీఎస్ఈ బోర్డు వెల్ల‌డించింది. ప్రాక్టిక‌ల్ టైమ్‌టేబుల్‌, ఇత‌ర సూచ‌న‌ల కోసం విద్యార్థులు, త‌ల్లిదండ్రులు త‌మ పాఠ‌శాల‌ల‌తో ట‌చ్‌లో ఉండాల‌ని సూచించింది.

Also Read..

బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష‌

11న ఆటోమోటివ్, ఈవీ రంగం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స‌మావేశం

బట్టల దుకాణంలో సేల్స్‌మాన్ టు అంతర్జాతీయ వేదిక.. ఎమ్మీ అవార్డ్స్‌లో విజయ్ సేతుపతి సరికొత్త చరిత్ర

Advertisement
Advertisement