త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ala Venkateshwer Reddy | క్రాప్ హాలిడే ఇస్తే.. కాంగ్రెస్‌కు కూడా ప్ర‌జ‌లు సెల‌విస్తారు

Ala Venkateshwer Reddy | రాష్ట్రంలో క్రాప్ హాలిడే ఇస్తే.. కాంగ్రెస్‌కు కూడా ప్ర‌జ‌లు సెల‌విస్తార‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి పేర్కొన్నారు. పంట‌లు ఎండిపోయి రైతులు దుఃఖంలో ఉంటే.. ఒక్క ఎక‌రా కూడా ఎండిపోలేద‌న‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Nov 6, 2026, 1.39 pm IST

Ala Venkateshwer Reddy | క్రాప్ హాలిడే ఇస్తే.. కాంగ్రెస్‌కు కూడా ప్ర‌జ‌లు సెల‌విస్తారు
Advertisement

Ala Venkateshwer Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో క్రాప్ హాలిడే ఇస్తే.. కాంగ్రెస్‌కు కూడా ప్ర‌జ‌లు సెల‌విస్తార‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి పేర్కొన్నారు. పంట‌లు ఎండిపోయి రైతులు దుఃఖంలో ఉంటే.. ఒక్క ఎక‌రా కూడా ఎండిపోలేద‌న‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. దేవ‌ర‌క‌ద్ర నియోజ‌క‌వ‌ర్గం కౌకుంట్ల మండలం ముచ్చింతల, దాసరిపల్లి గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు భరోసా ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పంటలు ఎండిపోయింది కనిపిస్తలేదా..? కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలవి కూడా పంట‌లు ఎండిపోయాయి. పంట పెట్టుబడి, బోర్లు వేసినా ఫలితం లేక రెండు రకాలుగా రైతులు నష్టపోయారు. ఒక్కో గ్రామంలో వందకు పైగా బోర్లు వేసిన చుక్క నీరు పడలేదు. కరువు మండలాల ప్రకటన చేయడం కాదు.. రైతులను ఎట్లా ఆదుకుంటారో చెప్పండి. రైతులను పరామర్శిస్తున్న మమ్మల్ని విమర్శించడం కాదు. ఎమ్మెల్యే గ్రామాల్లోకి వెళ్ళి చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితి నెల‌కొంది అని ఆల వెంకటేశ్వ‌ర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

కృష్ణా జలాలు ఒడిసి పట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇది. కృష్ణా నదీ పక్కనే ఉన్నా పంటలు ఎండిపోయాయి. నీటిని ఎత్తిపోయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలి. యాసంగి పంటలు వేస్తే కరెంట్, నీళ్ళు అడగొద్దని రైతులను డిక్లరేషన్ అడుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఓటు అడగమని డిక్లరేషన్ ఇవ్వాలి అని వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement