Harish Rao | అధైర్య పడకండి.. రేవంత్ మెడలు వంచుదాం
Harish Rao | కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఎదుట రైతులు వాపోయారు. రైతన్నలు అధైర్యపడకండి.. రేవంత్ సర్కార్ మెడలు వంచి సమస్యలను పరిష్కరించుకుందామని హరీశ్‌రావు ధైర్యం చెప్పారు.
కన్నీరు పెట్టుకున్న అన్నదాతలను ఓదార్చిన హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఎదుట రైతులు వాపోయారు. రైతన్నలు అధైర్యపడకండి.. రేవంత్ సర్కార్ మెడలు వంచి సమస్యలను పరిష్కరించుకుందామని హరీశ్‌రావు ధైర్యం చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు పంట పొలాలను పరిశీలించారు. ఈ క్రమంలో అడుగడుగునా అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు.
సకాలంలో కరెంటు అందక తన 7 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని కుమార్ అనే రైతు కంటతడి పెట్టాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటుతో రెండు పంటలు పండించుకున్నాం.. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని కేవలం ఒక్క ఎకరానికే వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుందని హరీశ్ రావుకు వారు మొరపెట్టుకున్నారు.
రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రుణమాఫీ అంతా బోగస్.. గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయాం.. మళ్లీ 100 శాతం కేసీఆర్ సార్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని హరీశ్ రావు ఎదుట రైతన్నలు ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
రైతన్నలు అధైర్యపడకండి.. ఈ రెండేళ్లు సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును, రైతుబంధును బంద్ పెట్టి పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా..? అని నిలదీస్తూ రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎండిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు పెండింగ్ రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీశ్ రావు తేల్చిచెప్పారు.
తాజావార్తలు
- ●TPCC Chief Mahesh Goud | గాంధీ భవన్‌కు పిలిచినా రాలేదు.. అధిష్టానానికి తేల్చి చెప్పిన పీసీసీ చీఫ్
- ●CBSE | విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
- ●Ponnam Prabhakar | 11న ఆటోమోటివ్, ఈవీ రంగం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం
- ●Vijay Sethupathi International Emmy Awards | బట్టల దుకాణంలో సేల్స్‌మాన్ టు అంతర్జాతీయ వేదిక.. ఎమ్మీ అవార్డ్స్‌లో విజయ్ సేతుపతి సరికొత్త చరిత్ర
- ●REITs | రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి మరో మార్గం.. REITలతో అద్దె ఆదాయం..

TPCC Chief Mahesh Goud | గాంధీ భవన్‌కు పిలిచినా రాలేదు.. అధిష్టానానికి తేల్చి చెప్పిన పీసీసీ చీఫ్

CBSE | విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు

POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Ponnam Prabhakar | 11న ఆటోమోటివ్, ఈవీ రంగం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం




