త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhupalapally | వివాహేత‌ర సంబంధం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్తను హ‌త్య చేసిన భార్య‌

Bhupalapally | భ‌ర్త‌ను కాద‌ని ఓ యువ‌కుడిపై మ‌న‌సు పారేసుకుంది భార్య‌. ఇంకేముంది.. ప్రియుడితో వివాహేత‌ర సంబంధం మొద‌లుపెట్టింది. ఈ విష‌యంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వివాదం చెల‌రేగింది. చివ‌ర‌కు త‌న సంతోషానికి అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి హ‌త్య చేసింది భార్య‌.

S

Telangana | Published On Nov 6, 2026, 1.51 pm IST

Bhupalapally | వివాహేత‌ర సంబంధం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్తను హ‌త్య చేసిన భార్య‌
Advertisement

Bhupalapally | త్రినేత్ర న్యూస్ : భ‌ర్త‌ను కాద‌ని ఓ యువ‌కుడిపై మ‌న‌సు పారేసుకుంది భార్య‌. ఇంకేముంది.. ప్రియుడితో వివాహేత‌ర సంబంధం మొద‌లుపెట్టింది. ఈ విష‌యంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వివాదం చెల‌రేగింది. చివ‌ర‌కు త‌న సంతోషానికి అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి హ‌త్య చేసింది భార్య‌.

వివ‌రాల్లోకి వెళ్తే.. భూపాల‌ప‌ల్లి జిల్లా ప‌రిధిలోని గొల్ల‌బుద్ధారం తండాకు చెందిన చందు(40)కు 2014లో పావ‌ని అనే మ‌హిళ‌తో పెళ్లైంది. చందు వ్య‌వ‌సాయం చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. పావ‌ని ఇంటి వ‌ద్దే ఉంటుంది. అయితే స్థానికుడైన ద‌రావ‌త్ సంతోష్‌తో పావ‌నికి ప‌రిచయం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ఈ క్ర‌మంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప‌లుమార్లు గొడ‌వ‌లు చోటు చేసుకున్నాయి.

చివ‌ర‌కు భర్త తమకు అడ్డుగా ఉన్నాడని భావించి గురువారం రాత్రి ప్రియుడు సంతోష్‌ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి చందును హత్య చేశారు. అనంతరం సంచిలో మూటకట్టి గ్రామ శివారులో రోడ్డు ప‌క్క‌నే ప‌డేశారు. కొంద‌రు ప్ర‌యాణికులు వీరిని గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసి, పావ‌ని, సంతోష్‌ల‌ను అందుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement