త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nifty 50 | దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో నిఫ్టీ.. 11 ఏళ్లలో 9 సార్లు లాభాలే..

Nifty 50 | దీపావళి సందర్భంగా నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్‌లో గత 11 ఏళ్లుగా నిఫ్టీ 50 పనితీరు ఆకట్టుకుంటోంది. 2015 నుంచి 2025 వరకు జరిగిన 11 ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లలో తొమ్మిది సార్లు లాభాలు నమోదు కాగా, రెండుసార్లు మాత్రమే నష్టాలు వచ్చాయి. 2022లో అత్యధికంగా 0.88 శాతం లాభం నమోదైంది.

S

Business | Published On Nov 6, 2026, 2.09 pm IST

Nifty 50 | దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో నిఫ్టీ.. 11 ఏళ్లలో 9 సార్లు లాభాలే..
Advertisement

Nifty 50 | దీపావళి సందర్భంగా నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్‌లో గత 11 ఏళ్లుగా నిఫ్టీ 50 పనితీరు ఆకట్టుకుంటోంది. 2015 నుంచి 2025 వరకు జరిగిన 11 ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లలో తొమ్మిది సార్లు లాభాలు నమోదు కాగా, రెండుసార్లు మాత్రమే నష్టాలు వచ్చాయి. 2022లో అత్యధికంగా 0.88 శాతం లాభం నమోదైంది.

ముహూర‌త్ ట్రేడింగ్‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌..

దీపావళి పండుగ సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లలో నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సంప్రదాయ ట్రేడింగ్ సెషన్‌లో గత 11 ఏళ్ల నిఫ్టీ 50 గణాంకాలను పరిశీలిస్తే, ఎక్కువ సందర్భాల్లో మార్కెట్ సానుకూలంగా ముగిసినట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 2015 నవంబర్ 11న నిఫ్టీ 7,825 పాయింట్ల వద్ద ముగిసి 0.54 శాతం లాభపడింది. 2016 అక్టోబర్ 30న 0.14 శాతం, 2017 అక్టోబర్ 19న 0.63 శాతం నష్టపోయింది. అయితే 2018 నవంబర్ 7న 0.65 శాతం, 2019 అక్టోబర్ 27న 0.37 శాతం, 2020 నవంబర్ 14న 0.47 శాతం, 2021 నవంబర్ 4న 0.49 శాతం లాభాలను నమోదు చేసింది.

2022లో అత్య‌ధిక లాభం..

2015 నుంచి 2025 వరకు నమోదైన గణాంకాల్లో 2022లో అత్యధికంగా 0.88 శాతం లాభం వచ్చింది. ఆ ఏడాది నిఫ్టీ 17,730.75 పాయింట్ల వద్ద ముగిసింది. 2023లో 0.52 శాతం పెరిగి 19,525.55 పాయింట్లకు, 2024లో 0.41 శాతం లాభంతో 24,304.35 పాయింట్లకు చేరింది. ఇక 2025 అక్టోబర్ 21న జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో స్వల్పంగా 0.10 శాతం పెరిగి 25,868.60 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ గణాంకాల్లో శాతం మార్పు అనేది ముహూరత్ ట్రేడింగ్ ముగింపు స్థాయిని అంతకుముందు ట్రేడింగ్ రోజు ముగింపు స్థాయితో పోల్చి లెక్కించినది. గతంలో వచ్చిన లాభాలు భవిష్యత్తులోనూ మార్కెట్లు లాభపడతాయనే హామీ ఇవ్వవని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement