Art of Living | ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు భారీ ఊరట.. ఆ రూ.5 కోట్లు తిరిగిచ్చేయాలంటూ సుప్రీం ఆదేశం
Art of Living | 2016లో యమునా వరద మైదానంలో (Yamuna floodplains) జరిగిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం వివాదానికి సంబంధించి శ్రీ శ్రీ రవిశంకర్ (Sri Sri Ravi Shankar) నేతృత్వంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ (Art of Living foundation)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) వేసిన రూ.5కోట్ల ఫైన్‌ను రద్దు చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని డీడీఏని ఆదేశించింది.
Art of Living | త్రినేత్ర.న్యూస్ : శ్రీ శ్రీ రవిశంకర్ (Sri Sri Ravi Shankar) నేతృత్వంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు (Art of Living foundation) సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. 2016లో యమునా పరివాహక ప్రాంతంలో (వరద మైదానం) జరిగిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం వివాదానికి సంబంధించి గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శనివారం రద్దు చేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..? 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT).. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు రూ.5 కోట్ల భారీ జరిమానా విధించింది. దీంతో ఫౌండేషన్ అప్పట్లో రూ. 5 కోట్లు డిపాజిట్ చేసింది. అంతేకాదు, ఎన్‌జీటీ ఆదేశాలపై సదరు ఫౌండేషన్ న్యాయపోరాటానికి దిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుబంధ సంస్థ అయిన వ్యక్తి వికాస కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవం కారణంగా యమునా పర్యావరణ వ్యవస్థకు నష్టం కలిగించిందనడానికి ప్రత్యక్ష ఆధారాలు లేవని స్పష్టం చేసింది. చట్టప్రకారం ఒకరిని పర్యావరణ కాలుష్యానికి పూర్తిగా బాధ్యులను చేయాలంటే.. వారు కాలుష్యానికి కారణమయ్యారని ఖచ్చితంగా నిరూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు గతంలో ఎన్‌జీటీ వేసిన ఫైన్‌ను రద్దు చేసింది. వ్యక్తి వికాస్ కేంద్రం చెల్లించిన జరిమానాను వెనక్కి ఇచ్చేయాలని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ధర్మాసనం ఆదేశించింది.
Also Read..
కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
మూడేండ్లలో ఒక్క డీఏ ఇవ్వలే.. ఇగ పీఆర్సీ అయితే ఊసే లేదు
రేవంత్ యూఎస్ టూర్ వెనుక అసలు ఉద్దేశం అదేనా? అందుకే కేంద్రం నో చెప్పిందా?
తాజావార్తలు
- ●Devi Prasad | మూడేండ్లలో ఒక్క డీఏ ఇవ్వలే.. ఇగ పీఆర్సీ అయితే ఊసే లేదు
- ●Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
- ●Kaaka Movie | ‘కాకా’గా చిరంజీవి.. డబుల్ షేడ్స్‌లో మెగాస్టార్ అదుర్స్..!
- ●Revanth Reddy US Tour | రేవంత్ యూఎస్ టూర్ వెనుక అసలు ఉద్దేశం అదేనా? అందుకే కేంద్రం నో చెప్పిందా?
- ●Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధన శాఖ మంత్రి వెల్లడి..
- ●Deviprasad | ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు?

Devi Prasad | మూడేండ్లలో ఒక్క డీఏ ఇవ్వలే.. ఇగ పీఆర్సీ అయితే ఊసే లేదు

Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత

Kaaka Movie | ‘కాకా’గా చిరంజీవి.. డబుల్ షేడ్స్‌లో మెగాస్టార్ అదుర్స్..!

Revanth Reddy US Tour | రేవంత్ యూఎస్ టూర్ వెనుక అసలు ఉద్దేశం అదేనా? అందుకే కేంద్రం నో చెప్పిందా?





