Harish Rao | కేసీఆర్ అంటే నమ్మకం.. రేవంత్ అంటే అమ్మకం
Harish Rao | వంటంతా మేమొండితే.. ఆఖరికి గంటే తింపి నేనే వండినా అని రేవంత్ గప్పాలు కొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు.
- బీఆర్ఎస్ అధినేత భూములు కాపాడితే.. రేవంత్ అమ్ముకొస్తుండు
- తీర్పు కాపీ రాకముందే మియాపూర్ భూములమ్మమని కలెక్టర్‌ను ఉరికిస్తుండు
- ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నవ్ రేవంత్?
- ఆఖరికి గంటె తింపి నేనే వండినా అంటుండు.. ఇది పక్కా క్రెడిట్ చోరీయే
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
Harish Rao | త్రినేత్ర న్యూస్: వంటంతా మేమొండితే.. ఆఖరికి గంటే తింపి నేనే వండినా అని రేవంత్ గప్పాలు కొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. ఇది ఓట్ చోరీ కాదని.. పక్కా క్రెడిట్ చోరీయేనన్నారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే అది రేవంత్‌కే వస్తుందని ఎద్దేవా చేశారు. తీర్పు కాపీ రాకముందే మియాపూర్ భూములమ్మాలని (Miyapur Lands) కలెక్టర్‌ను పరుగులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మరి ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అంటే నమ్మకమని.. రేవంత్ రెడ్డి అంటే అమ్మకమని నొక్కి చెప్పారు.
కాంగ్రెస్ ఓడిపోయిన భూమిని గెలిపించింది మేమే..
మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమి కేసు 2010లో కాంగ్రెస్ హయాంలో ఓడిపోయింది. నాడు ఏజీని కోర్టుకు పంపకుండా చిన్న జీపీని పంపి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు తెచ్చారు. 2017, మే 19న కేసీఆర్ ఆదేశాలతో దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను నియమించాం. 2021, డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 2023, ఆగస్టు 1న సుప్రీంకోర్టులో 142 ఎకరాలు ప్రభుత్వానివేనని తుది తీర్పు వచ్చినప్పడు ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ఓడిపోయిన భూమిని గెలిపించింది మేము, నిందలు మాత్రం మాపైనే.
30 ఏళ్ల గ్రేహౌండ్స్ ప్రహరీ గోడను రాత్రికి రాత్రే కూల్చేశారు. రెండు రోజుల్లో లోపలికి కొత్త గోడ కట్టారు. టెండర్ ఎవరిచ్చారు? 10 ఎకరాల 10 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు వదిలేశారు. గండిపేట ఎస్ఆర్ఓలో డాక్యుమెంట్ నం. 8886/2026 జీరో వాల్యూ రిజిస్ట్రేషన్. మార్కెట్ విలువ రూ. 45.39 కోట్లు, కన్సిడరేషన్ వాల్యూ సున్నా. 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజులో ఒక్క రూపాయి కూడా కట్టలేదు. డ్రీమ్ వ్యాలీ సంతోష్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్, వెంటనే మరో 20 రిజిస్ట్రేషన్లు. ఎకరం రూ.100 కోట్లు పలికే చోట రూ.1,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కొల్లగొట్టారు. అబద్ధానికి అంగీ లాగు తొడిగితే అచ్చం రేవంత్ రెడ్డి లెక్కనే ఉంటది.
ఇప్పటికీ ఆ పేరు మీదే ఉంది
భూభారతిలో ఈ రోజుకూ ఆ భూమి గ్రేహౌండ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పేరు మీదే ఉంది. ముఖ్యమంత్రి కనుసన్నల్లో కాకపోతే గ్రేహౌండ్స్ గోడ కూల్చే దమ్ము ఎవరికుంటుంది? ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన మరో 10 ఎకరాల నోటిఫికేషన్ రద్దు అప్పీల్‌కు వెళ్లలేదు. జడ్జి పేరా 134లో కొత్త నోటిఫికేషన్ ఇవ్వొచ్చని రాసినా మూడు నెలలుగా కదలిక లేదు. మంచిరేవులలో మొత్తంగా రూ.2,000 కోట్ల కుంభకోణం. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ సోదరుడిని జైలుకు పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
రిజిస్ట్రేషన్ చేసిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అదేరోజు కేసీఆర్ సస్పెండ్ చేశారు. 2016, జూన్ 1న జీవో 45తో జాగీర్ అబాలిషన్ యాక్ట్‌కు చట్టబద్ధత కల్పించాం. మియాపూర్ కేసు సుప్రీంకోర్టులో 192 సార్లు విచారణకు వచ్చింది. అందులో 86 సార్లు వాదించింది బీఆర్ఎస్ నియమించిన వైద్యనాథన్ గారే. కాంగ్రెస్ వచ్చాక జరిగింది కేవలం 11 విచారణలు మాత్రమే. మియాపూర్ తీర్పుకు పునాది 2023లో మేం గెలిచిన ట్రినిటీ తీర్పులోని పేరా 93.
ఆ ముఠాలో రేవంత్ భాగస్వామి కాదా?
భూపాలపల్లి అటవీ భూముల కేసును టీడీపీ, కాంగ్రెస్ 20 ఏళ్లు పట్టించుకోలేదు. 2021లో అక్రమార్కులను అరెస్టు చేసి జైలుకు పంపింది కేసీఆర్ ప్రభుత్వమే. భూమి కట్టబెట్టే ఉద్దేశమే ఉంటే వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తాం? SLP 6937/2021 దాఖలు చేసి మూడేళ్లు పోరాడింది బీఆర్ఎస్. 2024, ఏప్రిల్ 18న తీర్పు అధికారంలోకి వచ్చి మూడు నెలలకే రేవంత్ గెలిచాడా? ఐఎంజీ బిల్లీరావుకు ఎకరం రూ.50 వేలకు 850 ఎకరాలు కట్టబెట్టింది చంద్రబాబే. ఆనాడు ఆ టీడీపీ ముఠాలో రేవంత్ రెడ్డి భాగస్వామి కాదా? ఐఎంజీ కేసులో 9 ఏళ్లు పోరాడింది బీఆర్ఎస్, తీర్పు వచ్చింది 2024, మార్చి 7న. అప్పటికి రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు.
దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించు
కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికి జింకలను ఆగం చేసినందుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు పడ్డాయి. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో కుదువపెట్టారు. రూ.10 వేల కోట్ల అప్పు కోసం ముంబై బ్రోకర్‌కు రూ.400 కోట్ల కమిషన్ ఇచ్చిండు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు సవాల్ విసిరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hyderabad Ratnadeep | హైదరాబాద్ రత్నదీప్ రిటైల్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.400 కోట్ల సమీకరణకు అనుమతి
అక్టోబర్ 31, 2026

Bhadrachalam | భద్రాచలం వద్ద నవంబర్ 7 వరకు గోదావరి బ్రిడ్జి మూసివేత
అక్టోబర్ 31, 2026

Tummala Nageshwar Rao | తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి తుమ్మల
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●SIR | ఆ ఓట్లను తొలగించకూడదా? కాంగ్రెస్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్నలు
- ●Saroornagar Illegal Egg Donation | భారీ అండాల మాఫియా గుట్టురట్టు: హాస్టల్ కేంద్రంగా పేద యువతులకు వల.. కార్పొరేట్ ఆసుపత్రులకు విక్రయాలు
- ●IND Vs NZ T20 | చివరి టీ20కి టీమిండియా సన్నద్ధం.. తుది జట్టులో భారీ మార్పులు..!
- ●Hyderabad Ratnadeep | హైదరాబాద్ రత్నదీప్ రిటైల్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.400 కోట్ల సమీకరణకు అనుమతి
- ●Bhadrachalam | భద్రాచలం వద్ద నవంబర్ 7 వరకు గోదావరి బ్రిడ్జి మూసివేత
- ●Jailer 2 Collections | 800 కోట్లకు చేరువలో జైలర్ 2 - తెలుగులో రజనీకాంత్ సినిమాకు భారీ లాభాలు

SIR | ఆ ఓట్లను తొలగించకూడదా? కాంగ్రెస్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్నలు

Saroornagar Illegal Egg Donation | భారీ అండాల మాఫియా గుట్టురట్టు: హాస్టల్ కేంద్రంగా పేద యువతులకు వల.. కార్పొరేట్ ఆసుపత్రులకు విక్రయాలు

IND Vs NZ T20 | చివరి టీ20కి టీమిండియా సన్నద్ధం.. తుది జట్టులో భారీ మార్పులు..!

Hyderabad Ratnadeep | హైదరాబాద్ రత్నదీప్ రిటైల్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.400 కోట్ల సమీకరణకు అనుమతి



