త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Congress | అడ్డంకులను అధిగమించి.. ఢిల్లీ సభను విజయవంతం చేసిన టీకాంగ్రెస్

Telangana Congress | ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఢిల్లీలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) తన ఐక్యతను, సంస్థాగత బలాన్ని చాటుకుంది.

G

Telangana | Published On Nov 2, 2026, 12.28 pm IST

Telangana Congress | అడ్డంకులను అధిగమించి.. ఢిల్లీ సభను విజయవంతం చేసిన టీకాంగ్రెస్
Advertisement

Telangana Congress | త్రినేత్ర న్యూస్‌: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కుల కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఢిల్లీలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) తన ఐక్యతను, సంస్థాగత బలాన్ని చాటుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహకారంతో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్రం నుంచి 15 వేల మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఢిల్లీకి తరలివెళ్లి సభ విజయవంతం కావ‌డంలో కీలక పాత్ర పోషించారు. న‌వంబ‌ర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వంలో నిర్వహించిన ఈ సభకు దేశ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో అవకతవకలున్నాయంటూ కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలపై ప్రజలకు వివరించడమే సభ ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.

అడ్డంకులు ఎదురైనా..

తెలంగాణ (Telangana) నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఢిల్లీకి తరలివెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో చివరి నిమిషంలో రైల్వే అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ పార్టీ శ్రేణులు వెనుకడుగు వేయకుండా ప్రత్యేక బస్సులు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలు, విమానాల ద్వారా ఢిల్లీకి (Delhi) చేరుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ పిలుపును గౌరవిస్తూ స్వచ్ఛందంగా తరలివెళ్లడం తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud) నాయకత్వంలో చేపట్టిన సమన్వయ కార్యక్రమాలు ఈ భారీ తరలింపునకు దోహద పడ్డాయి. ఢిల్లీకి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ప్రయాణం, వసతి తదితర అంశాల్లో ఇబ్బందులు కలగకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ప్రత్యేక రైళ్లు లేకున్నా..

ప్రత్యేక రైళ్లు లేకున్నా హైదరాబాద్ నుంచి, రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివెళ్లారు. 100కుపైగా బస్సుల‌తోపాటు కార్లు ఇతర వాహనాలు, విమానాలలో భారీగా తరలివెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పీసీసీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 800లకుపైగా అద్దె గదులు, భోజన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వివిధ మార్గాలలో 15 వేలకు పైగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు.

సీఎం, పీసీసీతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, డీసీసీ అధ్యక్షులు పీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పోరేషన్ చైర్మన్ లు, అనుబంధ సంఘాల నాయకులు, అధికార ప్రతినిధులు, నహకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. భోజన, వసతి, ప్రోటోకాల్, రవాణా, తదితర ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేయడంలో పీసీసీ (TPCC) విజయవంతం అయింది. ప్రత్యక్షంగా ఢిల్లీ సభకు వెళ్లలేని లక్షలాది మంది తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సభను వీక్షిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి సంఘీభావం తెలిపారు. దీంతో ఢిల్లీ సభ ప్రభావం రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల వరకు విస్తరించింది.

పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్సాహం..

రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతున్న ఓటు హక్కుల పరిరక్షణ పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదర్శించిన ఐక్యత, క్రమశిక్షణ, సమన్వయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, కార్యకర్తల సమష్టి కృషి ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ తన వంతు బాధ్యతను బలంగా చాటుకుంది.

ట్యాగ్స్:

Mahesh GoudRahul GandhiRevanth ReddyTelangana CongressTPCC
Advertisement
Advertisement